E-Paper
Advertisement

Annamayya Distric: గాలిపటం ఎగరవేస్తుండగా కరెంట్ షాక్.. ఐదేళ్ల బాలుడు మృతి

Annamayya Distric: గాలిపటం ఎగరవేస్తుండగా కరెంట్ షాక్.. ఐదేళ్ల బాలుడు మృతి
Advertisement

Annamayya Distric: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఆకాశం రంగురంగుల గాలిపటాలతో హరివిల్లులా మారిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా..  చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ మేడల మీద, ఖాళీ ప్రదేశాల్లో గాలిపటాలు ఎగురవేస్తూ ‘కై పో చెక్’ అంటూ కేరింతలు కొడుతుంటారు. అయితే.. ఈ సంతోషపు క్షణాల్లో మనం చేసే చిన్నపాటి పొరపాట్లు, అజాగ్రత్తలు కొన్నిసార్లు ఊహించని విషాదాలకు దారితీస్తున్నాయి. అలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటుచుసుకుంది.  కరెంట్ వైర్లపై ఉన్న గాలిపటం తీసే క్రమంలో ఐదేళ్ల బాలుడు మ‌ృతి చెందాడు.

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో తీవ్ర విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. గోరాంచెరువు గ్రామ పరిధిలోని బుచ్చేవాండ్ల పల్లికి చెందిన ఆనంద శ్రీనివాస్ (5) అనే బాలుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌‌కు గురై మృతి చెందాడు. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడు.. పండుగ ఆనందంలో భాగంగా ఇంటి పై కప్పుపై గాలిపటం ఎగరవేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Advertisement

స్థానికుల సమాచారం మేరకు.. గాలిపటం అదుపు తప్పి సమీపంలో ఉన్న విద్యుత్ తీగలను తాకింది. ఆ సమయంలో బాలుడు గాలిపటం దారాన్ని పట్టుకుని ఉండటంతో ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారి మృతి వార్త గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే ముఖ్యంగా పిల్లలు ఈ గాలిపటాలు ఎగరవేస్తున్నప్పుడు విద్యుత్ తీగలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసుల సూచించారు.

Advertisement

ALSO READ: నా కొడుకు చనిపోయాడు.. సోషల్ మీడియా వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి.. కోమటిరెడ్డి ఆవేదన

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×