Indian Railway Fares: భారతీయ రైల్వే దేశానికి జీవనాడిగా పిలువబడుతోంది. ప్రతి రోజు దేశ వ్యాప్తంగా 13 వేల ప్యాసింజర్ రైళ్లు తన సేవలను అందిస్తున్నాయి. వీటి ద్వారా 2 కోట్లకు పైగా ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకర ప్రయాణం చేస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్. పొరుగు దేశాలకంటే మన రైల్వే ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్ చౌకగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు చెప్పారు. ప్లార్లమెంట్ వేదికగానే ఈ విషయాన్ని వెల్లడించారు.
పాక్తిస్తాన్, బంగ్లాదేశ్ కంటే మన రైల్వే ఛార్జీలు తక్కువ
భారత్ లో రైల్వే ఛార్జీల 2020 నుంచి మారలేదు. అంతేకాదు, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి పొరుగు దేశాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. భారత్ లో 350 కిలో మీటర్ల రైలు ప్రయాణానికి రైల్వే ఛార్జీ రూ. 121 కాగా, పాకిస్తాన్ లో ఆ ధర రూ. 436గా ఉంది. బంగ్లాదేశ్ లో రూ. 323గా నిర్ణయించారు. ఇక శ్రీలంకలో అదే దూరానికి రూ. 413 వసూళు చేస్తున్నారు. యూరప్ కంట్రీస్ లో భారత్ తో పోల్చితే 5 రెట్లు ఎక్కువగా వసూళు చేస్తున్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో మనకంటే ఎక్కువ ధరను కొనసాగిస్తున్నారు. భారత్ లో పేద, మధ్య తరగతి ప్రయాణీకులకు ప్రతి టికెట్ పై సుమారు సగం ధరను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల రూపంలో భరిస్తోంది. అందుకే, ప్రజలు తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణాలు చేస్తున్నారు.
Read Also: కాశ్మీర్ అందాలు చూడాలనుందా? తక్కువ ధరలో స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన IRCTC!
90 శాతం తగ్గిన రైల్వే ప్రమాదాలు
ప్రస్తుతం భారతీయ రైల్వేలో కవచ్ లాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో రైలు ప్రమాదాలు గణీయంగా తగ్గినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో పోల్చితే ఇప్పుడు 90 శాతం యాక్సిడెంట్లు తగ్గాయన్నారు. “లాలూ ప్రసాద్ హయాంలో ఏడాదిలో సగటున 700 రైలు ప్రమాదాలు జరిగాయన్నారు. వాటిలో సుమారు 234 ప్రమాదాలు, 464 పట్టాలు తప్పిన ఘటనలు ఉన్నట్లు వెల్లడించారు. అటు మమతా బెనర్జీ హయాంలో ఒక ఏడాదికి సుమారుగా 395 ప్రమాదాలు జరిగాయన్నారు. వాటిలో 165 ప్రమాదాలు కాగా, 230 పట్టాలు తప్పిన ఘటనలు ఉన్నాయన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి కేవలం 73 ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. వాటిలో 30 రైలు ప్రమాదాలు కాగా, 43 పట్టాలు తప్పిన ఘటనలు ఉన్నాయన్నారు. రైల్వే భద్రత కోసం మోడీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. 2014-15లో జరిగిన రైలు ప్రమాదాలతో పోల్చితే ఇప్పుడు 80 శాతం తగ్గినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 10,000 లోకోమోటివ్‌లు, 15,000 కి.మీ.లపై కవచ్ ఇన్ స్టాలేషన్ కొనసాగుతుందని వైష్ణవ్ వెల్లడించారు.
Read Also: ఇకపై రీఫండ్ పొందాలంటే అలా చెయ్యాల్సిందే, ప్రయాణీకులకు రైల్వే కీలక సూచన!
Read Also: మన దేశంలో అత్యంత చెత్త రైల్వే స్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాలు ఉన్నాయా?