OTT Movie : బాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే ఈ సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ కూడా బాలీవుడ్ నుంచి వచ్చింది. ఈ మూవీలో కండోమ్ కంపెనీ పై కేసు వేస్తాడు హీరో. తెలుగులో జనక అయితే గనక మూవీ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. కాకపోతే ఈ బాలీవుడ్ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. కండోమ్ వాడినా కూడా ప్రెగ్నెంట్ రావడంతో భార్యను అనుమానిస్తాడు భర్త. ఆ తర్వాత కోర్టుకు కూడా వెళతాడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బాలీవుడ్ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘కహానీ రబ్బర్‌బ్యాండ్ కి’ (Kahani rubber band ki). 2022 లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీకి సారిక సంజోత్ దర్శకత్వం వాయించి నిర్మించారు. ఇందులో ప్రతీక్ గాంధీ, అవికా గోర్, మనీష్ రైసింగన్, గౌరవ్ గేరా నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో బీటెక్ చేసి పనీపాటా లేకుండా తిరుగుతుంటాడు. హీరోయిన్ బుల్లెట్ బండి లో పానీ పూరి తినడానికి వస్తూ ఉంటుంది. హీరో ఆమెను చూసి ప్రేమలో పడతాడు. అలా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. 30 వయసు దాటుతూ ఉండటంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు హీరో. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటాడు. అయితే హీరోయిన్ పిల్లల్ని ఇప్పుడే వద్దనుకుంటుంది. ఇంట్లో వాళ్ళు పిల్లల్ని కనాలని చెప్తారు. ఇలా ఉండగా హీరో తన ఫ్రెండ్ షాప్ లో తక్కువ రేటు ఉండే కండోమ్ ధరించి ఫస్ట్ నైట్ చేసుకుంటాడు. ప్రతి రోజూ అవే వాడుతుంటాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ కి ప్రెగ్నెంట్ వస్తుంది. కండోమ్ వేసుకున్నా ప్రెగ్నెంట్ రావడంతో, హీరోయిన్ పై అనుమానం పెంచుకుంటాడు హీరో. ఇది తెలిసిన హీరోయిన్ అతనితో గొడవ పడి ఇంటికి వెళ్ళిపోతుంది.
ఊరిలో అందరూ హీరోయిన్ ప్రెగ్నెన్సి పై సూటిపోటి మాటలు మాట్లాడుతుంటారు. ఆ తరువాత హీరో తన తప్పును తెలుసుకొని హీరోయిన్ దగ్గరికి వస్తాడు. పోయిన పరువు తిరిగి వస్తేనే నీతో సంసారం చేస్తానని చెప్తుంది హీరోయిన్. అప్పుడు తన ఫ్రెండ్ తో కలిసి కండోమ్ కంపెనీ మీద కేసు వేస్తాడు హీరో. ఈ కేసు బయట కూడా బాగా వైరల్ అవుతుంది. కోర్టులో వాదనలు కూడా ఓ రేంజ్ లో జరుగుతాయి. చివరికి కోర్టులో వేసిన కేసును హీరో గెలుస్తాడా? పోయిన పరువు తిరిగి వస్తుందా? హీరోయిన్ కాపురానికి వస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కహానీ రబ్బర్‌బ్యాండ్ కి’ (Kahani rubber band ki) అనే ఈ మూవీని చూడండి.