Businessman Wife Murder| వివాహేతర సంబంధాలు జీవితంలో అనర్థాలకే దారితీస్తాయి. చాలా సార్లు హింసాత్మకంగా ఘటనలు కూడా జరుగుతాయి. తాజాగా అలాంటి ఒక ఆశ్చర్యకర కేసు ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల ముందుకు వచ్చింది. ఒక బడా వ్యాపారి భార్య తన భర్తను కాదని మరో వ్యక్తిని ప్రేమించింది. కానీ అతనితో వివాహం చేసుకోకుండా అతడిని లైంగిక సుఖాల కోసమే ఉపయోగించుకుంది. అయితే ఆమె తీరుతో విసిగిపోయిన ఆ ప్రియుడు ఆమెను కోపోద్రేకంలో హత్య చేశాడు. హత్య చేసిన తరువాత శవాన్ని వెంటనే పాతిపెట్టి ఊరు వదిలి వెళ్లిపోయాడు. పోలీసులు అతని కోసం ఎంత వెతికినా కనిపించలేదు. అనుకోకుండా ఇటీవల ఒక ప్రదేశంలో పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నగరానికి చెందిన రాహుల్ గుప్తా అనే బడా వ్యాపారి జూన్ నెల చివర్లో.. తన భార్య ఏక్తా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బిజినెస్ మెన్ రాహుల్ భార్య మిస్సింగ్ కేసులో విచారణ ప్రారంభించారు. ఏక్తా చివరగా తన జిమ్ ట్రైనర్ తో జిమ్ చేశాక కారులో వెళిపోయినట్లు కెమెరాల్లో ఉంది. అయితే రెండు రోజులుగా ఆమె కనిపించడం లేదు. ఆమెతో పాటు ఆ జిమ్ ట్రైనర్ జాడ కూడా తెలియడం లేదు.
చివరికి పోలీసులు వారిద్దరు వెళ్లిన కారుని స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు ఊరి చివర కొండప్రాంతంలో నిలబడి ఉంది. కారులో సిమ్ కార్డుల ప్యాకెట్లు లభించాయి. దీంతో పోలీసులు వారిద్దరూ నగరం వదిలి పారిపోయారని.. ఇద్దరు ప్రేమించకున్నారని భావించి కేసు విచారణ ఆపేశారు. కానీ రాహుల్ గుప్తా తన భార్య అలాంటిది కాదని ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని.. ఇంట్లో ఆమె నగలు, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అన్నీ ఖాళీ అయిపోయాయని.. పోలీసు ఉన్నతాధికారులకు మళ్లీ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఏక్తా మిస్సింగ్ కేసులో మళ్లీ విచారణ ప్రారంభించారు. ఏక్తా, ఆమె జిమ్ ట్రైనర్ విమల్ సోనీ కోసం గాలించడం మొదలుపెట్టారు. కానీ వారిద్దరి కాన్పూర్ లో కాకుండా మరో నగరానికి పారిపోయనట్లు అనుమానించారు.
Also Read: ఇద్దరు భర్తలను వదిలి అక్క మొగుడితో సహజీవనం.. అనుమాస్పద స్థితిలో మృతి
ఏక్తా, ఆమె జిమ్ ట్రైనర్ విమల్ సోనీ ని వెతికేందుకు కాన్పూర్ పక్క నగరం ఆగ్రాతో పాటు విమల్ సోనీ సొంత రాష్ట్రం పంజాబ్.. అలాగే ఏక్తా స్వస్థలం పుణెలో పోలీసు బృందాలు బయలుదేరాయి. కానీ ఎక్కడా వారి జాడ తెలియలేదు. దీంతో కేసు విచారణ ఆపేశారు.
కానీ అనుకోకుండా అక్టోబర్ 24న విమల్ సోనీ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కనిపించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నగరంలోని సిసి టీవీల వీడియోలు పరిశీలించి.. చివరకు అతడిని పట్టుకున్నారు. పోలీసుల చేతికి చిక్కిన విమల్ సోనీ.. విచారణలో షాకింగ్ విషయాలు చెప్పాడు.
పోలీసుల కథనం ప్రకారం.. బిజినెస్‌మెన్ రాహుల్ గుప్తా భార్య ఏక్తా, తన జిమ్ ట్రైనర్ విమల్ సోనీతో ప్రేమలో పడింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది. అయితే విమల్ సోనీ ఆమెను తనతో పెళ్లి చేసుకోవాలని ఎంత చెప్పినా ఆమె వినలేదు. కానీ విమల్ సోనీ తల్లిదండ్రులు అతని వివాహం మరో యువతితో నిశ్చయించారు. ఈ విషయం తెలిసిన ఏక్తా తన ప్రియుడిని నిలదీయడానికి జూన్ 24న జిమ్ కు వెళ్లింది. జిమ్ లో అందరూ చూస్తుండగా.. అతడితో కోపంగా మాట్లాడింది. దీంతో విమల్ ఆమెను బయటికి తీసుకెళ్లి.. తన కారులో కూర్చోబెట్టి మాట్లాడాడు. ఇక తమ ఇద్దరి మధ్య సంబంధాన్ని ఇంతటితో ముగించాలని ఆమెతో అన్నాడు.
Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?
అయితే ఏక్తా అందుకు ఒప్పుకోలేదు. వారిద్దరి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విమల్ ఆమెను కోపంతో బలంగా ఒక దెబ్బ కొట్టాడు. ఏక్తా మెడపైన ఆ దెబ్బ గట్టిగా తగలడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇక ఏక్తా స్పృహలోకి వస్తే.. మళ్లీ గొడవ చేస్తుందని భావించి.. విమల్ ఆమెను అక్కడే ఆ క్షణమే చంపేశాడు. అయితే చంపిన తరువాత కాన్పూర్ లోని ఆఫీసర్స్ కాలనీలో జిల్లా కలెక్టర్ బంగ్లా పక్కనే పాతిపెట్టాడు. విమల్ సోనీ ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద ఆఫీసర్లకు జిమ్ ట్రైనింగ్ ఇచ్చేందుకు తరుచూ వెళ్లేవాడు. దీంతో అతడిని ఎవరూ అనుమానించలేదు. ఆ తరువాత విమల్ సోనీ కాన్పూర్ వదిలి వెళ్లిపోయాడు. అతను ఫోన్ నెంబర్ కూడా మార్చేసాడు. దీంతో పోలీసులు అతడి ఆచూకీ తెలుసుకోలేకపోయారు.
ప్రస్తుతం పోలీసులు కలెక్టర్ బంగ్లా పక్కన పాతిపెట్టిన ఏక్తా శవాన్ని వెలికి తీశారు. ఆ శవం చాలా వరకు అస్తిపంజరంగా మారిపోయింది. కానీ శవం ధరించి ఉన్న దుస్తులను ఏక్తా భర్త గుర్తించి ఆ శవం తన భార్యదేనని చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు విమల్ సోనీపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.