E-Paper
Advertisement

Serial Killer: మనుషుల మాంసాన్ని లొట్టలేసుకుని తిన్న గ్రామస్తులు.. ఒక్కడే 27 మందిని చంపి!

Serial Killer: మనుషుల మాంసాన్ని లొట్టలేసుకుని తిన్న గ్రామస్తులు.. ఒక్కడే 27 మందిని చంపి!
Advertisement

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.1918 నుంచి 1923 వరకు జర్మనీ పూర్తిగా విచ్ఛిన్నమైంది. యుద్ధంలో ఓడిపోయి అత్యంత దయనీయంగా మారింది. డబ్బులు ఉన్నా, తినేందుకు తిండిదొరకని పరిస్థితి. ఒక్క రొట్టె ముక్క ధర లక్షల రూపాయులు పలికింది. మాంసం కొనడం అసాధ్యంగా మారింది. చాలా మంది బంగాళా దుంపలు, గడ్డితో చేసిన సూప్ తాగి బతికారు. ఆకలితో అలమటించి ఎంతో మంచి చనిపోయారు. ఈ సమయంలోనే ఓ నరరూప రాక్షసుడు అత్యంత ఘోరమైన పని చేశాడు. ఆహార కొరతను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నంచాడు. ప్రపంచంలో ఎవరూ చేయలేని కిరాతకానికి ఒడిగట్టాడు.

చిన్నప్పటి నుంచే నేరాలు..

ఫ్రిట్జ్ హర్మాన్ అనే వ్యక్తి.. 1879లో జన్మించాడు. చిన్నప్పటి నుంచే నేరాలకు పాల్పడేవాడు. దొంగతనాలు చేయడం, మహిళలను లైంగికంగా వేధించడం లాంటి పనులు చేసి, పలుమార్లు జైలుకు వెళ్లాడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతడు హనోవర్‌ కు వెళ్లాడు. చూడ్డానికి చాలా సింపుల్ గా కనిపించేవాడు. పొట్టిగా, లావుగా, స్నేహపూర్వకంగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాడు. చిన్న దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు అతడు సాయం చేసేవాడు. చాలా మంది అధికారులు కూడా అతడిని నమ్మేవారు. అతడో నరరూప రాక్షసుడు, అత్యంత కిరాతకమైన హంతకుడని ఎవరికీ తెలియదు.

యువకులను చంపి.. మాంసాన్ని అమ్మి..

Advertisement

హనోవర్ రైల్వే స్టేషన్ లో చాలా మంది ఒంటరి యువకులు కనిపించేవారు. ఇంటి నుండి పారిపోయి వచ్చిన అబ్బాయిలు, కుటుంబం లేని అనాథలు, ఉద్యోగం కోసం వెతికే టీనేజర్లు ఈ స్టేషన్ పరిసరాల్లో ఎక్కువగా ఉండేవారు. హర్మాన్ ప్రతిరోజూ స్టేషన్ చుట్టూ తిరిగేవాడు. మంచి బట్టలు ధరించేవాడు. సిగరెట్లు తాగుతూ ఆకట్టుకునేవాడు. స్టేషన్ లో ఉండేవారికి భోజనం పెట్టించేవాడు. చక్కగా మాట్లాడేవాడు. తన రూమ్ లో ఒక్కడినే ఉంటున్నాని, తనతో పాటు ఉండవచ్చని చెప్పేవాడు.  13 నుండి 20 సంవత్సరాల వయస్సు ఉన్న యువకులను తన గదికి తీసుకెళ్లేవాడు. చాలా మంది అతడిని నమ్మి వెళ్లేవారు.

భయంకరమైన హత్యలు!

హర్మాన్ అపార్ట్ మెంట్ కు వెళ్లగానే పరిస్థితులు పూర్తిగా మారిపోయేవి. నమ్మి వచ్చిన వ్యక్తులను వెనుక నుంచి బలంగా కొట్టేవాడు. ఊపిరి ఆగేంత వరకు గొంతు కొరికేవాడు. వేడి రక్తం బయటకు చిమ్ముతుంటే.. పైశాచిక ఆనందం పొందేవాడు. చనిపోయిన వ్యక్తి నుంచి మాంసం, ఎముకలు వేరు చేసేవాడు. ఎముకలను రాత్రిపూట పక్కనే ఉన్న లీన్ నదిలో పడేసేవాడు. మాంసాన్ని రెస్టారెంట్లకు, వీధిలోని వారికి తక్కువ ధరకు అమ్మేవాడు.

ఆ మాంసాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు!

Advertisement

చాలా మంది చాలా మంది కస్టమర్లు.. అతడు అమ్మేది పంది మాసం అనుకునేవారు. చాలా రుచిగా ఉందని తినేవారు. వారికి ఇది మనిషి మాంసం అని తెలియదు. హర్మాన్ మనుషులను చంపి, మాంసాన్ని అమ్మి బాగా డబ్బు సంపాదించాడు. చాలా రిచ్ లైఫ్ గడిపేవాడు.

పోలీసులకు ఎలా చిక్కాడంటే?

1924 మేలో లీన్ నది దగ్గర ఆడుకుంటున్న పిల్లలు కొన్ని మనిషి పుర్రెలను గమనించారు. ఎక్కువ సంఖ్యలో కనిపించడంతో పోలీసులకు విషయం తెలిసింది. అదే సమయంలో రైల్వే స్టేషన్‌ నుంచి ఓ చిన్న పిల్లాడితో హర్మాన్‌ వెళ్లడాన్ని చూశారు. పోలీసులు అతడిని ఫాలో అవుతూ వెళ్లారు. ఆయన అపార్ట్ మెంట్ లో రక్తంతో నిండిన గోడలు,  తప్పిపోయిన యువకులు దుస్తులు, వస్తువులు, కత్తులు కనిపించాయి.

27 మందిని కిరాతకంగా చంపిన హర్మాన్

పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, విచారణ మొదలు పెట్టారు. హర్మాన్ కొన్ని గంటల్లోనే చేసిన తప్పులను ఒప్పుకున్నాడు.  27 మందిని చంపినట్లు చెప్పాడు. ప్రతి ఒక్కరిని ఎలా చంపాడో వివరించాడు. డిసెంబర్ 1924లో విచారణ ప్రారంభమైంది. వారిని చంపినందుకు తనకు ఎలాంటి బాధ లేదని చెప్పేవాడు.  కోర్టులో నవ్వుతూ జాలీగా కనిపించేవాడు. 24 హత్యలకు అతడిని దోషిగా తేల్చి కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. 1925 ఏప్రిల్ 15న, ఫ్రిట్జ్ హర్మాన్ ను  జైలు ప్రాంగణంలో గిలెటిన్‌ తో తల నరికి చంపేశారు. ఈ హనోవర్ కిరాతక హత్యల కేసు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన అత్యంత దారుణమైన నేరాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

Read Also: ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి మాయం.. 6 నెలలు తర్వాత ఊహించనిది జరిగింది, కన్నీళ్లు పెట్టించే ఘటన!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×