EPAPER

A.P.:వల్లభనేని వంశీ..ఏ క్షణమైనా అరెస్ట్?

A.P.:వల్లభనేని వంశీ..ఏ క్షణమైనా అరెస్ట్?

Case filed on Ysrcp leader Vallabhaneni Vamshi.. attack on Gannavaram ttd office
మొన్నటి ఏపీ ఎన్నికలు వైసీపీ శ్రేణులకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అంతకు ముందు ఎంతో ధీమాగా వైనాట్ 175 అంటూ హోరెత్తించిన నేతలు ఓటమి పరాభవంతో ప్రస్టేషన్ కు గురయ్యారు.అయితే ఎన్నికల ముందు వైసీపీ శ్రేణులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఏడాది ఎన్నికల ప్రకటనకు ముందు ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీటీడీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారు. అందినకాడికి విధ్వంసం సృష్టించారు. కార్యాలయంలో ఫర్నీచర్ కు నిప్పు పెట్టారు. అడ్డొచ్చిన టీడీపీ కార్యకర్లలను చితకబాదారు. దాదాపు ఐదారుగంటలపాటు విధ్వంసం కొనసాగించారు. ఇంత జరుగుతున్న స్థానిక పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. మళ్లీ అధికారం తమదే అన్న ధీమాతో బీభత్సాన్ని సృష్టించారు. స్థానికులు కూడా భయంతో వణికిపోయారు వీరి ఆగడాలు చూసి. పైగా వల్లభనేని వంశీ అనుచరులు ఇంతా చేసి రివర్స్ గా టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు. పైగా దుర్ఘటన జరిగిన రోజు ఓ రాత్రంతా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని జీపులోనే ఆ రాత్రంతా తిప్పారు. నరకానికి స్పెల్లింగ్ చెప్పారు. అయితే వైసీపీ నేతల ఆశలు వమ్ముచేస్తూ మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. గన్నవరం పార్టీ కార్యాలయం విధ్వంస ఘటనపై వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర వహించిన చాలా మంది నేతలు ఇప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులలో కొందరికి గుర్తించారు. ఇదంతా వంశీ ప్రోద్భలంతోనే జరిగిందని సాక్షాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేశారు.


71 మందిలో 15 మంది అరెస్ట్
వల్లభనేని వంశీ నిందితుడుగా పలు సాక్ష్యాలు లభ్యమవడంతో పోలీసులు అరెస్టుకు సిద్ధమయ్యారని సమాచారం. దీనిపై కోర్టులో సాక్ష్యాలను సమర్పించారు. వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని విన్నవించారు. వైఎస్ఆర్ సీపీ నేత వల్లభనేని వంశీపై పోలీసులు 143, 147,148,435,506 రెడ్ విత్ 149, 3(1) ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసును నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా వల్లభనేని వంశీ ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశం ఉంది. వల్లభనేని వంశీని ఈ కేసులో 71వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. బుధవారం దాడికి పాల్పడ్డ నేతలలో కొంంరిని గుర్తించి వారిని అరెస్టు చేశారు. గన్నవరం టీడీడీ ఆఫీస్ ఆపరేటర్ మదునూరి సత్యవర్జన్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాదాపు 71 మంది దాడికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో 15 మందిని బుధవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలు పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Tags

Related News

Kazipet CI: కాజీపేట్ సీఐ కామాంధుడు.. బాలికపై సీఐ అత్యాచారయత్నం.. ఆపై

Woman Murder Cement: యువతిని చంపి శవంపై సిమెంట్ పోసి.. హంతకుడు ఎలా చేశాడంటే?..

Bengaluru Airport Scam: మహిళా ప్యాసింజర్‌ను దోచుకున్న బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.. ఆమె ఫోన్‌లో ఏం చేశారంటే?..

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. చిన్నారిపై అత్యాచారం.. నిందితుడు ఆ నేత వద్ద కారు డ్రైవర్

Kadapa District: కడప జిల్లా, లోయలో పడిన ఆర్టీసీ బస్సు, 30 మందికి గాయాలు.. తప్పెవరిది?

Pizza Gun Shot: పిజ్జా తిన్నందుకు యువతిని తుపాకీతో కాల్చిన బంధువులు.. ఇంట్లో తోడికోడళ్ల గొడవే కారణం!

Bengaluru: దారుణం.. తండ్రి అప్పు చెల్లించలేదని కుమార్తెపై అత్యాచారం!

Big Stories

×