Vikas Kohli: విరాట్ కోహ్లీ కుటుంబ విషయాలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఆస్తులను మొత్తం సోదరుడు వికాస్ కు ఇస్తున్నట్లు కోహ్లీ గురించి అనేక రకాల వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వికాస్ కోహ్లీ సంచలన పోస్ట్ పెట్టాడు. కొంత మంది తన కుటుంబంపై అనేక రకాల పోస్టులు పెడుతున్నారని. అందులో ఏమాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు వికాస్ కోహ్లీ. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
తన సోదరుడు వికాస్ కు ( Vikas kohli ) ఆస్తులు ఇస్తున్నట్లు విరాట్ కోహ్లీపై నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. గురు గ్రామ్ లో ఉన్న తన ఇంటిని సోదరుడు వికాస్ కు విరాట్ కోహ్లీ ( Kohli) బదిలీ చేశాడట. తన ఇంటిని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కింద వికాస్ కు అప్పగించాడట కోహ్లీ. అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఆర్థిక, చట్టపరమైన, ఇతర వ్యాపార సంబంధిత పనులు చూసుకోవడానికి మరొక వ్యక్తికి అవకాశం కల్పించడమే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. దీని ప్రకారం మాత్రమే వికాస్ కోహ్లీకి బాధ్యతలు అప్పింగించాడు. కానీ ఆస్తులు మొత్తం వికాస్ కు ఇచ్చేసినట్లు, డబ్బులు దానం చేసినట్లు కోహ్లీపై వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై తాజాగా వికాస్ కోహ్లీ సంచలన పోస్ట్ పెట్టాడు. అదంతా ఫేక్ అని కొట్టిపారేశారు. తమ కుటుంబంపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి.. ఇదంతా తప్పుడు సమాచారం. ఏ వార్తలు నమ్మకండి అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు కోహ్లీ సోదరుడు వికాస్. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఆస్తులు ఎంతో తెలిస్తే అందరు షాక్ అవ్వాల్సిందే. అతని ఆస్తుల విలువ 127 మిలియన్స్. అంటే దాదాపు 1050 కోట్లు అధికారికంగా ఉన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలికి సంబంధించిన గ్రేడ్ ఏ ప్లస్ లిస్టులోనే విరాట్ కోహ్లీ ఉన్నాడు. దీని ప్రకారం విరాట్ కోహ్లీకి ఏడాదికి ఏడు కోట్ల రూపాయలు జీతం వస్తుంది. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా ఏడాదికి 21 కోట్లు సంపాదిస్తున్నాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఆడితే 15 లక్షలు, టి20లో మూడు లక్షలు సంపాదించేవాడు. అయితే ఆ రెండు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు కేవలం వన్డేలలో ఆడుతున్నాడు. ఒక వన్డే కు ఆరు లక్షల రూపాయలు తీసుకుంటాడు.
Virat Kohli's brother's latest Instagram story. pic.twitter.com/1yvtMPplQy
— Tanuj (@ImTanujSingh) October 17, 2025