E-Paper
Advertisement

మెడికల్ షాపులో దారుణం.. క్యాషియర్‌పై దుండగుల కాల్పులు.. స్పాట్‌లో ఒకరు మృతి, సీసీటీవీ కెమెరా సాక్షిగా

మెడికల్ షాపులో దారుణం..  క్యాషియర్‌పై దుండగుల కాల్పులు.. స్పాట్‌లో ఒకరు మృతి, సీసీటీవీ కెమెరా సాక్షిగా
Advertisement

Cashier Shot Dead: దేశంలో గన్ కల్చర్ పెరుగుతోంది. పట్ట పగలు దుండగులు కాల్పులకు తెగబడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మధ్యాహ్నం సమయంలో మెడికల్‌ షాపులోని ఓ క్యాషియర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. స్పాట్‌లో ఆయన మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఘటన ఎక్కడ? ఏం జరిగింది?

చండీగఢ్‌లోని ఓ మెడికల్ షాపులో దారుణం

Advertisement

చండీగఢ్‌ సెక్టార్-11లోని ఓ ఫార్మసీ షాపులో శనివారం మధ్యాహ్నం దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు మెడికల్ షాపుకు వచ్చారు. అందులోని క్యాషియర్ జానకీ దాస్‌ను లక్ష్యంగా చేసుకుని పలు రౌండ్ల బుల్లెట్ల వర్షం కురిపించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి ఘటనలో మృతి చెందిన వ్యక్తి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జానకిదాస్. శ్రీ కుమార్ మెడికల్ షాపులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ప్రాథమిక సమాచారం మేరకు.. టోపీలు ధరించిన నిందితులు, ముఖానికి మాస్క్‌లు ధరించారు. కస్టమర్ల మాదిరిగా మెడికల్ స్టోర్‌లోకి ప్రవేశించారు.

Advertisement

క్యాషియర్‌పై దుండగుల కాల్పులు, స్పాట్‌లో ఒకరు మృతి

అందులో పని చేస్తున్న ఉద్యోగులు కస్టమర్లకు సేవలు అందిస్తుండగా, వారిద్దరు ఎంట్రీ ఇచ్చారు. జేబులో నుంచి గన్ తీసి, అతి సమీపంలో క్యాషియర్‌పై కాల్పులు జరిపారు. అక్కడి నుంచి వారిద్దరు పరారయ్యారు. దుండగులు యాక్టివా స్కూటర్‌పై ఘటనా స్థలం నుంచి పారిపోయారు.

నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులు జరిగిన కొద్దిసేపటికి పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఘటనకు సంబంధించి సాక్ష్యాలు సేకరించడం ప్రారంభించారు. మెడికల్ స్టోర్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని దిగ్బంధించి వెలుపల బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ALSO READ: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. చిన్నారితోపాటు ముగ్గురి మృతి, సిద్ధిపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

గన్ శబ్దంతో అక్కడున్న వారంతా భయంతో హడలిపోయారు. మెడికల్ షాపు పక్కనే ఓ షాపులోని వ్యక్తులు పరుగున పరిగెత్తుకుంటూ వచ్చారు. గన్ శబ్దానికి షాపులో పని చేసే ఇద్దరు వ్యక్తులు భయంతో కింద పడిపోయారు. వారికి తీవ్రగాయాలు అయ్యాయి. మెడికల్ స్టోర్ యజమానికి గతంలో బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

2017లో కుమార్ బ్రదర్స్ మెడికోస్ బయట ఇద్దరు యువకులు గాలిలోకి కాల్పులు జరిపినట్టు సమాచారం. ఆ సమయంలో ఎవరికీ గాయాలు కాలేదు. తాజా ఈ ఘటన పాత కక్షల వల్ల జరిగిందా? బెదిరింపులకు సంబంధించి కాల్పులు జరిపారా? అనేదానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×