E-Paper
Advertisement

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. చిన్నారితోపాటు ముగ్గురి మృతి, సిద్ధిపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. చిన్నారితోపాటు ముగ్గురి మృతి, సిద్ధిపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
Advertisement

Road Accident: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలోని ఇంట్లోని ఉన్న ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లో మృతి చెందారు. వెంటనే ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో ఇంట్లో నుంచి కారును బయటకు తీశారు పోలీసులు. అసలు ఘటన ఎలా జరిగింది?

సిద్ధిపేట్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

సిద్ధిపేట్ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండపాక మండలం దుద్దెడలో ఓ వృద్ధురాలు రహదారి దాటుతోంది. అదే రోడ్డులో వేగంగా ఓ కారు దూసుకొచ్చింది. మహిళలను తప్పించే క్రమంలో అదుపు తప్పింది కారు. రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది.

ఘటన సమయంలో ఇంటి ముందు అరుగుపై కూర్చున్న లక్ష్మి, ఆమె కూతురు, ఓ వృద్ధురాలు స్పాట్‌లో మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారు సిద్ధిపేట్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం తర్వాత కారులోని వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారు అయ్యారు.

Advertisement

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. చిన్నారితోపాటు ముగ్గురి మృతి

మృతులు పేర్లు లక్ష్మి, ఆమె కూతురు సహస్ర, వృద్ధరాలు రాధవ్వ ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఘటన గురించి తెలియగానే మృతులు బంధువులు అక్కడికి చేరుకున్నారు. కారు నెంబర్ ఆధారంగా వాహనం ఎవరిది? అందులోని నడుపుతున్న వారు ఎవరు? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-లారీ ఢీ, ఏపీకి చెందిన 20 మంది వరకు 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×