E-Paper
Advertisement

అవినాష్ దెబ్బకు నవ్యస్వామి షాక్!

అవినాష్ దెబ్బకు నవ్యస్వామి షాక్!
Advertisement

Navya Swamy: ప్రముఖ నటి నవ్య స్వామి(Navya Swami) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు ‘మీనాక్షి’ సీరియల్ తో అశేష ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ .. ఈ మధ్యకాలంలో సీరియల్స్ కంటే బుల్లితెర షోలలో ఎక్కువగా సందడి చేస్తోంది. మరొకవైపు ముక్కు అవినాష్ (Mukku Avinash) జబర్దస్త్ (Jabardasth) కామెడీ షోలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకుని.. ఏకంగా బిగ్ బాస్ (Bigg Boss) లో అవకాశం సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. జబర్దస్త్ ను వీడాలి అంటే రూ.10లక్షలు ఫైన్ కట్టాలనే రూల్ తో పది లక్షలు ఫైన్ కట్టి మరీ జబర్దస్త్ వీడిన ముక్కు అవినాష్ బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకొని.. ప్రస్తుతం స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న షోలలో సందడి చేస్తున్నారు.

పాపం నవ్య స్వామి.. ముక్కు అవినాష్ దెబ్బకు షాక్..

అలాంటి షోలలో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో కూడా ఒకటి. ఇందులో ప్రముఖ యాంకర్ శ్రీముఖి (Sree Mukhi), ముక్కు అవినాష్ హోస్ట్ లుగా వ్యవహరిస్తుండగా.. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేస్తున్నారు. అందులో భాగంగానే లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో ముక్కు అవినాష్ దెబ్బకు నవ్య స్వామి షాక్ అయింది. మరి ఈ ప్రోమో లో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Advertisement

also read:రూటు మార్చిన విజయసాయిరెడ్డి.. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు, అసలు వీక్‌నెస్ అదే

టీవీ స్టార్స్ వర్సెస్ డిజిటల్ స్టార్స్..

షోలో భాగంగా ‘టీవీ స్టార్స్ వర్సెస్ డిజిటల్ స్టార్స్’ అంటూ ఒక టాస్క్ నిర్వహించింది శ్రీముఖి. అందులో ఒకవైపు టీవీ స్టార్స్ మరొకవైపు డిజిటల్ స్టార్స్ ఒక్కొక్కరిగా స్టేజ్ పైకి వస్తారు. పక్కపక్కనే రెండు టేబుల్స్ పెట్టి అందులో పెద్ద బాక్స్ మూసి ఉంచి ఉంటుంది. ఎవరు ఏది పిక్ చేసుకుంటారో…దాని ముందుకు వచ్చి నిల్చోండి అంటూ చెప్పగా ..వారు ఆయా స్థానాలకు వెళ్లి నిల్చుంటారు. ఓపెన్ చేయగానే అక్కడ ఆహార పదార్థాలు ఉంటాయి. ఇక అందులో భాగంగానే ఒకవైపు పెద్ద బౌల్లో ఎక్కువ ఆహారం ఉంటే .. అదే వైపు ఆపోజిట్ అదే ఆహారం కొంచెం గా ఉంటుంది. ఇక దానిని వారు తినాల్సి ఉంటుంది.

నవ్య స్వామిని ఇమిటేట్ చేసిన ముక్కు అవినాష్..

Advertisement

అలా రాము రాథోడ్, ఎక్స్ప్రెస్ హరి టాస్క్ కోసం రాగా.. ఇద్దరు అనుకున్న స్థానాల కంటే .. ఆ తర్వాత మారిపోతారు.. ఇక రాము రాథోడ్ ఎదురుగా పెద్ద బౌల్ లో చాలా సమోసాలు ఉండగా.. ఆయన బుక్ అయిపోతాడు. హరి కి ఎదురుగా ఉన్న ఒక బౌల్లో ఒక సమోసా మాత్రమే ఉండడంతో ఆయన సేఫ్ అయిపోతాడు..ఆ తర్వాత నవ్య స్వామి వంతు వస్తుంది. రక్షా గౌడ నవ్య స్వామి పోటీ పడతారు. అయితే రక్ష గౌడ ఎంచుకున్న బాక్స్ ను నవ్య స్వామి. నేను కూడా అదే అంటూ కాస్త డిఫరెంట్ స్టైల్లో చెబుతుంది ..ఇక దాంతో రక్షా గౌడ ఇటువైపు రాగా నవ్య స్వామి అటువైపు వెళుతుంది. అయితే శ్రీముఖి బాక్స్ ఓపెన్ చేయగానే ఫుల్ కేక్ నవ్య స్వామి ఎదురుగా రావడంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. దాంతో ఆమె స్టైల్ ని ఇమిటేట్ చేస్తూ ముక్కు అవినాష్ ఇచ్చిన ఫోజుకి ఒక్కసారిగా నవ్య స్వామి షాక్ అయిపోయింది. అది చూసిన వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Related News

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

Big Stories

Advertisement
×