BigTV English

Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ హంగామా, ఒక ఇల్లు చోరీ, ఆపై పోలీసుల వేట

Cheddi Gang:  చెడ్డీ గ్యాంగ్ హంగామా, ఒక ఇల్లు చోరీ, ఆపై పోలీసుల వేట

Cheddi Gang: ఎండకాలం మొదలుకావడంతో చెడ్డీ గ్యాంగ్ తెలంగాణ అంతటా తిరుగుతోందా? పగలు తమకు కావాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారా? స్కెచ్ ప్రకారం రాత్రి వేళ దోపిడీ రెడీ అవుతున్నారా? కొన్నాళ్లు సైలెంట్ అయిన చెడ్డీ గ్యాంగ్ తెలంగాణలో ఎంటరయ్యిందా? హనుమకొండలో రాత్రి ఏం జరిగింది? వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారా? అవుననే అంటున్నారు పోలీసులు.


గురువారం రాత్రి హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో యూనివర్సిటీ ఫస్ట్ గేట్‌కు ఎదురుగావున్న ఓ ఇంట్లో చొరబడింది. 500 గ్రాముల రెండు వెండి నాణేలు ఎత్తుకెళ్లారు. వారి ఆనవాళ్లు తెలియకుండా ఇంటి ఆవరణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆ గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తెల్లవారితే ఈ విషయాన్ని ఇంటి బాధితులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంటి ఆవరణాన్ని పరిశీలించారు. రోబరీ చేసింది చెడ్డీ గ్యాంగ్ పనేనని నిర్థారణకు వచ్చారు ఖాకీలు. వీరిని పట్టుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు ముమ్మరం చేవారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా ఈ గ్యాంగ్ ఎటు వైపు వెళ్ళింది అనేదానిపై ఆరా తీస్తున్నారు.


ఇదిలాఉండగా వరంగల్ సిటీలో ఒకే రోజు మూడు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ సంచారం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. విద్యారణ్య పురి, కేయూ, మడికొండ స్టేషన్ల పరిధిలో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. దీంతో ఆయా పీఎస్‌ల పరిధిలో తనిఖీలు చేశారు.

ALSO READ: నీళ్ల బకెట్ లో ముంచి పసికందును చింపేసిన తల్లి

ఎవరికైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులను అలర్ట్ చేస్తున్నారు పోలీసులు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెడ్డీ గ్యాంగ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు.

హనుమకొండ నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ రావడంతో కలవరం మొదలైంది. ఇంటి నిర్వాహకులు సైతం బెంబేలెత్తుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు అన్నీఇన్నీ కావు. దుండగులంతా ముఖానికి ముసుగు పెట్టుకుని ఇంటింటికీ తిరుగుతారు. నిఘా తక్కువగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకుంటారు. వీలు కుదరని పక్షంలో అర్ధరాత్రి తలుపులు బాదుతారు. పొరపాటు తలుపు తీశామా బుక్కైపోయినట్టే.

గతంలో హైదరాబాద్ సిటీలో మారణాయుధాలతో దాడులకు దిగేవారు. తాజాగా వరంగల్ నగరంపై కన్నేశారు.  చెడ్డీ గ్యాంగ్ కరుడుగట్టిన దొంగలు. వీరందరి బ్యాచ్‌కి డ్రస్సింగ్ కోడ్ ఒక్కటే ఉంటుంది. కేవలం చెడ్డీ మాత్రమే.  శరీరానికి ఆయిల్ రాసుకుంటారు. ఒకవేళ ఎవరైనా పట్టుకున్నా, సులువుగా జారిపోవడం వీరికి వెన్నతో పెట్టి విద్య.

ఏదైనా ఇంటికి తాళం వేసి ఉంటే చాలు.. ముఖానికి మాస్క్‌లు లేదా నల్లరంగు వేసుకుంటారు. ఆపై దోచుకోవడమే వీరి పని. దాదాపు  మూడు దశాబ్దాలుగా వీరి చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు సాగుతున్నాయి. దొంగతనాలు చేయడంలో వీరికి తిరుగులేదని చెబుతారు. ట్రెండ్ కు తగ్గట్టుగా మారిపోవడం వీరికి అలవాటు కూడా.

Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×