BigTV English

Balayya – Jr NTR: ఫస్ట్ అబ్బాయ్, సెకండ్ బాబాయ్.. ఏం చేసిన సెన్సేషనే?

Balayya – Jr NTR: ఫస్ట్ అబ్బాయ్, సెకండ్ బాబాయ్.. ఏం చేసిన సెన్సేషనే?

Balayya – Jr NTR: నందమూరి హీరోలు ఏం చేసిన సెన్సేషనే. ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి తారకరామారావు వారసత్వాన్ని అందుకొని.. అగ్ర హీరోలుగా దూసుకుపోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna). మూడో జనరేషన్ లెగసీ కంటిన్యూ చేస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ (N. T. Rama Rao Jr.) టాప్ హీరోగా రానిస్తున్నాడు. బాబాయ్, అబ్బాయ్ బాక్సాఫీస్ బరిలోకి దిగితే.. లెక్కలన్నీ మారాల్సిందే. అయితే.. కొత్త సినిమాలే కాదు.. రీ రిలీజ్ సినిమాల్లోను కొత్త ట్రెండ్‌కు దారి తీస్తున్నారు బాబాయ్, అబ్బాయ్. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. నందమూరి బాలకృష్ణ నటించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం “ఆదిత్య 369” (Aditya 369) మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. 1991లో విడుదలై భారీ విజయం సాధించిన ఈ చిత్రం, భారతీయ సినిమాల్లో మొట్టమొదటి టైమ్ ట్రావెల్ మూవీగా గుర్తింపు పొందింది. ఈ సినిమాను సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాను.. 4K డిజిటలైజేషన్ మరియు 5.1 సౌండ్ క్వాలిటీతో మరింత అధునాతనంగా తీర్చిదిద్ది, ఏప్రిల్ 4వ తేదీని రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఆదిత్య 369 రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.


ఫస్ట్ ఈవెంట్ ఎన్టీఆర్‌దే.. ఆదిత్య 369 అప్పుడే?

మామూలుగా అయితే.. కొత్త సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుంటారు. కానీ ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలకు కూడా ఈవెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆదిత్య 369 రీ రిలీజ్ సందర్భంగా, ఒక ప్రత్యేక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ ఉగాది రోజున జరగనుందని సమాచారం. నందమూరి బాలకృష్ణతో పాటు చిత్ర బృందంలోని కొంతమంది కీలక సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ వేడుకలో సినిమా గురించిన కొన్ని ఆసక్తికర విశేషాలు, రీ-రిలీజ్ వెర్షన్‌లోని ప్రత్యేకతలు ప్రేక్షకులతో పంచుకోనున్నారు. అయితే.. ఆదిత్య 369 రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ టాలీవుడ్ మొదటి ఈవెంట్‌ కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రీ రిలీజ్‌కు తొలిసారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌ గెస్ట్‌గా ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్.. టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హాజరయ్యాడు. ఆ సమయంలో యంగ్ టైగర్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రీ రిలీజ్ సినిమాల్లో సింహాద్రి బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఇక ఇప్పుడు ఆదిత్య 369 రీ రిలీజ్‌ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆదిత్య 369 రీ రిలీజ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.


బాలయ్య అప్‌కమింగ్ మూవీస్!

ప్రస్తుతం బాలయ్య ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. హ్యాట్రిక్ హిట్స్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ బూజు దులిపేస్తున్నాడు. గత సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. వచ్చే దసరా సందర్భంగా అఖండ తాండవం రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో అఖండ 2 పై భారీ అంచనాలున్నాయి. ఇక ఆ తర్వాత వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. గోపీచంద్ మలినేనితో సినిమా లాక్ చేసి పెట్టుకున్నాడు. ఆ తర్వాత డాకు మహారాజ్‌తో సాలిడ్ హిట్ ఇచ్చిన బాబీతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఆదిత్య 369 రీ రిలీజ్‌తో సినీప్రియుల్ని మరోసారి టైమ్‌మిషన్‌ ఎక్కించి.. కాల ప్రయాణం చేయించడానికి, థియేటర్లో సందడి చేయడానికి వస్తున్నారు బాలయ్య.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×