Bhadrachalam News: శ్రీరామ నవమి రోజున భద్రాచలం సీతారాముల కల్యాణం చూడాలని చాలామంది భావిస్తున్నారా? మహోత్సవానికి వెళ్లలేకపోయినా రాములోరి తలంబ్రాలు కావాలా? అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? దీనికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ భక్తులకు శుభవార్త చెప్పింది. లాజిస్టిక్స్ విభాగం ద్వారా రాములోరి తలంబ్రాలను ఇంటికే తీసుకొచ్చే ప్రయోగం చేసింది. అదెలా అంటారా? అక్కడికే వచ్చేద్దాం.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త చెప్పారు భద్రాచలం శ్రీరామ ఆలయ అధికారులు. శ్రీరామనవమి కల్యాణ తలంబ్రాలను ఇంటికి పంపే ఏర్పాట్లు చేశారు. తలంబ్రాల కోసం ఆన్‌లైన్ (bhadradritemple.telangana.gov.in) బుకింగ్స్ మొదలయ్యాయి. బుక్ చేసుకున్న భక్తులకు తలంబ్రాలను పంపిస్తామని ఆలయం ఈవో రమాదేవి వెల్లడించారు. ముత్యాల తలంబ్రాల ఒక ప్యాకెట్‌కు తక్కువ ధరలో ఉంటుంది.
తలంబ్రాలు బుక్ చేసుకున్న భక్తులకు పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా వాటిని అందజేయనున్నారు. tgsrtclogistics.co.in/TSRTC/ పక్కన కనిపిస్తున్న లింక్ క్లిక్ చేయగానే తలంబ్రాలు బుకింగ్ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే ఇంగ్లీష్ లేదా తెలుగులో పేరును నమోదు చేసుకోవాలి. ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత అడ్రస్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రం, జిల్లా, మండలం, టౌన్, గ్రామం ఇలా అన్ని వివరాలను అందులో ఇవ్వాలి. అన్ని వివరాలు సరి చూసుకున్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున భద్రాచలం శ్రీరాముడి ఆలయంలో స్వామి కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కల్యాణానికి వెళ్లాలని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.
ALSO READ: మెట్రో ఎండీ ఔట్.. ఆరువేల మందిపై వేటు
వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఈ కల్యాణం తిలకించడానికి తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి అక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. శ్రీ సీతారాముల కల్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తలంబ్రాలు ఒక్కో వస్తువుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
ముత్యాలు ప్రశాంతతకు చిహ్నంగా భావిస్తుంటారు. వధూవరులు మంచి మనస్సుతో జీవించాలని సూచిస్తుంది. పసుపు శుభానికి, సౌభాగ్యానికి ప్రతీక. ధాన్యం సిరి సంపదలకు చిహ్నంగా భావిస్తారు. రాములోకి కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను మహిళలు వారి చేతులు, గోళ్లతో మాత్రమే సిద్ధం చేస్తారు. ఇలా తయారు చేయడం వల్ల తలంబ్రాలకు పవిత్రత చేకూరుతుందని భక్తులు నమ్ముతారు.
శ్రీ రామనవమికి భద్రాచల సీతారాముల కల్యాణ మహోత్సవానికి వెళ్లలేకపోతున్నారా? మీకు పరమ పవితమైన రాములోరి తలంబ్రాలు కావాలా? ఐతే మీకు #TGSRTC మంచి అవకాశం కల్పిస్తోంది. లాజిస్టిక్స్ విభాగం ద్వారా తలంబ్రాలను మీ ఇంటికే తీసుకొస్తుంది.
మీరు చేయాల్సిందల్ల ఇప్పుడే బుకింగ్ చేసుకోవడమే.… pic.twitter.com/oql1tIErOC
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 25, 2025