Chennai Crime : తమిళనాడులోని ఓ ప్రభుత్వ వైద్యుడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచిన ఘటన సంచనం సృష్టిస్తోంది. వైద్యడిపై దాడితో (Attack On Doctor) ఏకంగా ఆ రాష్ట్రంలో వైద్య సేవలన్నీ నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ తమిళనాడు ప్రభుత్వం(tamilanadu Govt).. వెనువెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇంతకీ ఏమైందంటే.?
ఇటీవల వైద్యులు, హాస్పిటళ్లపై దాడులు పెరిగిపోతున్నాయి. వివిధ కారణాలు, ఆరోపణలతో నిందితులు దాడులకు తెగబడుతున్నారు. దాంతో.. వైద్యులు(Doctors) బిక్కుబిక్కుమంటూ వైద్యం అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తమ తప్పిదం ఏమీ లేకున్నా, వైద్యంతో రికవరీ అయ్యే సమయం మించిపోయిన తర్వాత ఆసుపత్రులకు వచ్చిన వారి మరణాల విషయాల్లోనూ.. భావోద్వేగాలు గురై చాలా మంది వైద్యులపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికే.. అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరగగా.. వైద్యుల రక్షణ కోసం అనేక చట్టాలు, నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. అయినా.. పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. నిత్యం ఏదో ఓ చోట వైద్యులపై దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా.. చెన్నైలో (Chennai) జరిగిన ఇలాంటి ఘటన వైద్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
తమిళనాడులోని గిండి కలయాన్ సెంటినరీ ఆసుపత్రిలో (Kalaignar Centenary Hospital) డా.బాలాజీ విధులు నిర్వహిస్తున్నారు. అంకాలజీ (oncologist) విభాగంలో పనిచేస్తున్న డా. బాలాజీ దగ్గరకు.. విఘ్నేష్(Vignesh) అనే వ్యక్తి అతని తల్లితో కలిసి కొన్నాళ్లుగా వస్తున్నాడు. ఇప్పటికే.. బాలాజీ అనేక సార్లు అవసరమైన మందులు రాసి పంపిస్తున్నాడు. అయితే.. అతను తన తల్లిని సరిగా చూడడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడంటూ.. విఘ్నేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా.. ఔట్ పేషెంట్ వార్డు దగ్గర డా. బాలాజీతో గొడవకు దిగిన నిందితుడు.. సరిగా వైద్యం చేయడం లేదంటూ దాడికి తెగబడ్డాడు. తన వెంట ఆసుపత్రిలోకి తీసుకువచ్చుకున్న పదునైన చిన్న కత్తితో.. డా.బాలాజీ పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. మొత్తం ఏడు చోట్ల కత్తితో పొడిచి.. ఆసుపత్రి నుంచి నెమ్మదిగా పారిపోయేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది(Security Persons) .. నిందితుడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ దాడిలో వైద్యుడు బాలాజీ మెడ, చెవి వెనుక, నుదురు, వీపు సహా పలుచోట్ల విఘ్నేశ్ కత్తితో దాడి చేయడంతో.. ఆసుపత్రిలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కత్తిపోట్లకు బాధిత డాక్టర్ వెంటనే కుప్పకూలిపోగా.. స్పందించిన మిగతా డాక్టర్లు అతన్ని ఐసీయూ కి తరలించి అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. అయితే.. ఇప్పటికీ వైద్యుడి పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించిన వైద్యులు.. బాధితుడు హార్డ్ పేషెంట్ అని, అతని పరిస్థితి 8 తర్వాత చెబుతామని ప్రకటించారు. ఈ ఘటనతో తమిళనాడులోని వైద్య వర్గాలు ఉలిక్కిపడ్డాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన వైద్యులు, వైద్య సిబ్బంది.. తమ రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు.
దాడి ఘటన తర్వాత తమిళనాడు వైద్యారోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ (Ma Subramanian) ఆసుపత్రిని సందర్శించారు. దాడి ఘటనను తీవ్రంగా ఘండించిన మంత్రి, దాడి సమయంలో నిందితుడికి సాయం చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్(Chief Minister MK Stalin) సైతం పూర్తి స్థాయి దర్యాప్తునకు(detailed inquiry) ఆదేశాలు జారిచేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు తగిన చికిత్స అందించడంలో మన ప్రభుత్వ వైద్యుల నిస్వార్థ కృషి ఎనలేనిదని, వారికి భద్రత కల్పించడం మన కర్తవ్యం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.. అని స్టాలిన్ ప్రకటించారు.