BigTV English
Advertisement

Spirit Don Lee : ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంటిరా బాబు, డాన్ లీ కి వీడియో ఎడిట్స్ చేస్తున్నారు

Spirit Don Lee : ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంటిరా బాబు, డాన్ లీ కి వీడియో ఎడిట్స్ చేస్తున్నారు

Spirit Don Lee : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే తన ఇంపాక్ట్ ఏంటో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చూపించాడు. అప్పట్లో వచ్చిన శివ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ సాధించింది అర్జున్ రెడ్డి. టెక్నికల్ గా కూడా చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పటికీ విజయ్ కెరియర్ లో బెస్ట్ ఫిలిం అంటే అర్జున్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో కబీర్ సింగ్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అయింది. కానీ కబీర్ సింగ్ సినిమాని చాలామంది బాలీవుడ్ ప్రముఖులు వైలెంట్ ఫిలిం అంటూ కామెంట్ చేశారు.


అసలు వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను చూపించబోతున్నాను అంటూ అనిమల్ సినిమాను తెరకెక్కించాడు సందీప్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు 1000 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ వసూలు చేసింది. రన్బీర్ కపూర్ కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్స్ ఈ సినిమా తీసుకొచ్చింది. ఈ సినిమాకి కూడా చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఆడియన్స్ రెస్పాన్స్ ముందు అవేమీ పెద్దగా కనిపించలేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాను చేయనున్నాడు సందీప్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.

Also Read : Sankranthiki Vasthunam: 18 ఏళ్ల తరువాత ఆ సింగర్ ను దింపుతున్న అనిల్.. ఈ జనరేషన్ ను మెప్పించగలడా.. ?


గత కొన్ని రోజుల నుండి స్పిరిట్ సినిమాలో డాన్ లీ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్ గా డాన్ లీ కూడా ఇంస్టాగ్రామ్ స్టోరీ లో సలార్ పోస్టర్ షేర్ చేశాడు. ఇక్కడితో ఈ కథనాలకు మరింత బలం చేకూరింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా డాన్ లీ వీడియోస్ ఎడిట్ చేయడం మొదలుపెట్టారు. ఎంతవరకు తెగించారంటే డాన్ లీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ కి తమ వాయిస్ ఆడ్ చేసి కృష్ణంరాజుకి అతిపెద్ద ఫ్యాన్ అంటూ ఎడిట్ చేయడం మొదలుపెట్టారు. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు సంబంధించి ఇంకా కాస్టింగ్ స్టార్ట్ చేయలేదు అంటూ తెలిపాడు. కానీ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సందీప్ రెడ్డికి మ్యూజిక్ మీద ఎంత అవగాహన ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మ్యూజిక్ తోనే సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఒక హై ఇస్తుంటాయి. సందీప్ గత సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించనున్నాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×