Varun Tej About Allu Arjun: టాలీవుడ్‌లో అత్యధిక హీరోలు పరిచయమయ్యింది మెగా ఫ్యామిలీ నుండే. ఈ మెగా హీరోలందరికీ సెపరేట్‌గా ఉన్న ఫ్యాన్‌బేస్ కంటే మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేసే ఎక్కువ. ఆ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకడు. అయితే గత కొన్నాళ్లుగా రాజకీయాల్లో వచ్చిన విభేదాల వల్ల అల్లు అర్జున్ ఒకవైపు, ఫ్యామిలీ అంతా ఒకవైపు అయిపోయింది. అప్పటినుండి మెగా హీరోలు కూడా బన్నీకి దూరంగానే ఉంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అలా జరిగిన తర్వాత వరుణ్ తేజ్ ముందుగా ‘మట్కా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో దీని ప్రమోషన్స్‌లో భాగంగా తనకు అల్లు అర్జున్ గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అలా చేస్తుంటాడు
మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కు ఉన్న విభేదాల గురించి ఈ హీరోలు ఎవ్వరూ ఇప్పటివరకు నేరుగా మాట్లాడలేదు. అల్లు అర్జున్ గురించి అడిగినా కూడా మెగా హీరోలు మామూలుగానే స్పందిస్తున్నారు. అలా తాజాగా ‘మట్కా’ ప్రమోషన్స్‌లో వరుణ్ తేజ్ గురించి తమ మధ్య ఉన్న స్వీట్ మెమోరీస్‌నే గుర్తుచేసుకున్నాడు. అల్లు అర్జున్ గురించి చెప్పమని అనగా.. ‘‘చిన్నప్పుడు నేను బాగా లావుగా ఉండేవాడిని, బుగ్గలు ఉండేవి. వీడు భలే క్యూట్‌గా ఉన్నాడంటూ ‘ఎప్పుడూ నా బుగ్గలు గిల్లుతూ ఉంటాడు. ఇప్పటికీ నేను తనను కలిస్తే అదే చేస్తుంటాడు. చెల్లి పెళ్లిలో కూడా గట్టిగా బుగ్గలు గిల్లేశాడు’’ అని తమ మధ్య జరిగే ఫన్నీ సందర్భాల గురించి చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్ (Varun Tej).
Also Read: రిలీజ్ అయ్యేవే రెండు… వాటికి కూడా అదే దుస్థితి..
అవే ప్రశ్నలు
‘‘నాకు ప్రత్యేకంగా ఎవ్వరితోనూ ఒక సందర్భం అంటూ లేదు. ఒక్క ఎపిసోడ్ ఇలా అని చెప్పలేను. ఒకసారి కజిన్స్ అందరం కలిసి రాజస్థాన్‌కు ట్రిప్‌కు వెళ్లాం. అప్పుడు మేమందరం బాగా ఎంజాయ్ చేశాం. అప్పుడు బన్నీ కూడా మాతో పాటు వచ్చాడు’’ అని గుర్తుచేసుకున్నాడు వరుణ్ తేజ్. తరువాత అల్లు అర్జున్ (Allu Arjun) కూడా తన అప్‌కమింగ్ మూవీ ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో బిజీ అవుతాడు. అప్పుడు కూడా మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న విభేదాల గురించి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దానిపై తను ఎలా స్పందిస్తాడా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారీ బడ్జెట్ సినిమా
వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘మట్కా’ (Matka). కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ‘మట్కా’ షూటింగ్ ప్రారంభించి చాలాకాలం అవుతున్నా ఎక్కువగా అప్డేట్స్ అందించకపోవడంతో ఈ మూవీపై పెద్ద బజ్ క్రియేట్ అవ్వలేదు. అందుకే ఇప్పటికైనా ఈ సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తవ్వగా దాంతో పాటు ఎన్నో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్.