Tamil Nadu Student Gangrape | తమిళనాడులో ఒక దారుణమైన సంఘటన జరిగింది. విద్య బోధించాల్సిన నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకులుగా మారిపోయారు. సభ్య సమాజం తలవంచుకునేలా ఆ ఉపాధ్యాయులు ప్రవర్తించారు. ఒక విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ కలకలం రేపింది. ఈ నేపథ్యంలో.. దారుణానికి పాల్పడిన ముగ్గురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఒక మైనర్ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ సంఘటనలో ఆ విద్యార్థిని గర్భవతి అయ్యింది. ఈ విషయం తన తల్లికి చెప్పడంతో ఆమె ఆవేదన చెంది, గత నెల రోజులుగా తన బిడ్డను పాఠశాలకు పంపించలేదు. స్కూలుకు సెలవు పెట్టించి గర్భస్రావం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలిసింది.
ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయుడు.. వెంటనే శిశు సంక్షేమ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో బాధితురాలితో ఫిర్యాదు చేయించారు. ఆ తరువాత ఆ బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈ దారుణ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఉపాధ్యాయులు చిన్నసామి (57), ప్రకాష్ (37), ఆర్ముగం (45) లను అరెస్టు చేశారు. ఈ సంఘటన చర్చనీయాంశంగా మారడంతో.. స్థానికులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఈ సంఘటన తర్వాత వారిని జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: కుక్కలతో ఆ పని చేసినందుకు దోషికి 475 ఏళ్ల జైలు.. ఎంత క్రూరంగా చేసేవాడంటే
ఇటీవలి కాలంలో తమిళనాడులో వరుసగా లైంగిక దాడుల సంఘటనలు స్టాలిన్ ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 23న అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై లైంగిక వేధింపుల సంఘటన తీవ్ర అలజడికి కారణమైంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో, ప్రతిపక్ష బీజేపీ నిరసనలు చేపట్టింది. స్టాలిన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
విద్యార్థినిపై ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం
ఉపాధ్యాయులే పాఠశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన తమిళనాడులోని కృష్ణగిరిలో చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పాఠశాలలో పని… pic.twitter.com/d7KJseixvj
— ChotaNews App (@ChotaNewsApp) February 6, 2025
ఇలాంటిదే మరో సంఘటన గతేడాది జనవరిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పిడురాళ్ల మండలంలోని ఒక గ్రామంలో ఒక బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికపై ఉపాధ్యాయుడు పది రోజుల క్రితం అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి ఆ బాలిక ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో, ఆమె మేనత్త ఆమెను కరాలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.