E-Paper
Advertisement

జనగామ జిల్లాలో విషాదం.. గుంతలో పడి ఐదేళ్ల బాలిక మృతి

జనగామ జిల్లాలో విషాదం.. గుంతలో పడి ఐదేళ్ల బాలిక మృతి
Advertisement

Jangaon: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతుల కోసం ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో సుమారు నాలుగు మీటర్ల లోతున గుంత తవ్వారు. అయితే పని పూర్తయినా, కాకపోయినా ఆ గుంతను అలాగే వదిలేయడం ఘోర తప్పిదం.

పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న కవిత అనే మహిళ తన ఐదేళ్ల కుమార్తె మోక్షితను వెంటపెట్టుకుని బడికి వచ్చింది. ఆడుకుంటూ వెళ్లిన ఆ చిన్నారి, ప్రమాదవశాత్తు నీటితో నిండి ఉన్న ఆ గుంతలో పడిపోయింది. ఊపిరాడక ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

Advertisement

గత 20 రోజులుగా ఆ గుంత ప్రమాదకరంగా తెరిచే ఉన్నా, అధికారులు పట్టించుకోకపోవడమే ఈ అనర్థానికి కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల లాంటి చోట ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నిస్తూ, మృతదేహంతో నిరసనకు దిగారు. కళ్ళముందే ఆడుకోవాల్సిన బిడ్డ విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం.

Also Read:వారెవ్వా.. ఇది కదా సక్సెస్ అంటే.. కొడుకుతో కలిసి టెన్త్ పాసైన అమ్మ!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×