BigTV English

100 Cr FD Scam: ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ 100 కోట్ల స్కామ్, రంగంలోకి దిగిన సీఐడీ

100 Cr FD Scam: ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ 100 కోట్ల స్కామ్, రంగంలోకి దిగిన సీఐడీ

100 Cr FD Scam: అసలే ఫిక్స్‌డ్ లేక బ్యాంకులు విలవిలలాడుతున్నాయి. వాటిని పెంచాలంటూ  అధికారులు ఒత్తిళ్లు పెరిగాయి. కానీ ఈ బ్రాంచ్ మేనేజర్ మాత్రం వెరైటీ వ్యక్తి. ఫిక్స్‌డ్ డిపాజిట్లను టార్గట్ చేశాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా కోట్లాది రూపాయలు దోచేశాడు. దీనిపై నిగ్గు తేల్చేందుకు సీఐడీ రంగంలోకి దిగినట్టు సమాచారం.


లొకేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట.. ఐసీఐసీఐ బ్యాంక్. బ్రాంచ్ మేనేజర్‌గా నరేశ్ చంద్రశేఖర్ ఏడేళ్ల కిందట బాధ్యతలు చేపట్టాడు. ఖాతాదారుల ఇంటింటికీ వెళ్లి బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ చేయాల ని, వడ్డీ ఎక్కువగా వస్తుందని నమ్మబలికారు. స్వయంగా బ్యాంక్ మేనేజర్ రావడంతో ఆయన మాటలు నమ్మారు.

చంద్రశేఖర్ ట్రాప్‌లో కొంత మంది పడ్డారు. ఈ క్రమంలో కొందరు ఫిక్స్‌డ్ చేసి బాండ్లు తీసుకున్నారు. దాదాపు 80 నుంచి 100 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. కొందరైతే తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లను రెన్యువల్ చేయించుకున్నారు.


ఈ నేపథ్యంలో ఖాతాదారుల సొమ్మును తన ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలోకి మళ్లించు కున్నాడు బ్రాంచ్ మేనేజర్. ఖాతాదారులకు అందులో నుంచి నెలనెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. కొందరికి డబ్బు జమ కాలేదు. నేరుగా బ్యాంకు వెళ్లి మేనేజర్‌ని అడిగితే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ALSO READ: జాయ్ జమీమా కేసులో దిమ్మ తిరిగే నిజాలు,

తాము మోసపోయామని బావించిన బాధితులు, తమ డబ్బు తిరిగి ఇవ్వాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరకు లాకర్లలో దాచుకున్న బంగారం సైతం మాయమైనట్టు తేలింది. గోల్డ్ అప్రైజర్ ఆత్మహత్యాయత్నం చేసుకుని చికిత్స పొందుతున్నాడు.

మేనేజర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ విషయంలో తెలియగానే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు బ్యాంకు సిబ్బంది ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. దీనిపై రేపో మాపో సీఐడీ రంగంలోకి దిగనుంది. ఈ వ్యవహారంలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×