BigTV English

CMRF scan: దొంగ బిల్లులతో దోపిడి.. 17 ప్రైవేట్ హాస్పిటల్స్‌పై సీబీఐ చర్యలు, మరీ ఇంత మోసమా?

CMRF scan: దొంగ బిల్లులతో దోపిడి.. 17 ప్రైవేట్ హాస్పిటల్స్‌పై సీబీఐ చర్యలు, మరీ ఇంత మోసమా?

CID cases filed agaist on 17 hospitals in telangana  CMRF scam: చిరంజీవి నటించిన ఠాగూర్ మూవీలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చచ్చిపోయిన శవానికి ట్రీట్ మెంట్ పేరిట లక్షల్లో బిల్లు వేస్తారు. అచ్చంగా తెలంగాణలోనూ చేయని చికిత్సలకు చేసినట్లుగా నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ నిధులు అడ్డగోలుగా దోచుకున్న నిందితుల బాగోతం బయటపడింది. ఫేక్ బిల్లులు సమర్పించి సీఎంఆర్ఎఫ్ నుంచి భారీ ఎత్తున ఫండ్స్ విత్ డ్రా చేశారు నిందితులు. రోగులకు సీఎంఆర్ఎఫ్ కింద వైద్యం చేసినట్లు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వాటిని సీఎం కార్యాలయానికి పంపి నిధులను విడుదల చేయించుకున్నాయి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు .


30 ఆసుపత్రులలో తనిఖీలు

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో సీఐడీ అధికారులు దాదాపు 30 ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్,వరంగల్ జిల్లాలలో మొత్తం ముప్పై ఆసుపత్రులపై తనిఖీలు నిర్వహించి 17 ప్రైవేటు ఆసుపత్రులపై కేసులు బుక్ చేసింది సీఐడీ. పేద రోగుల చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఏర్పాటు చేయడం జరిగింది.గత ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్ కు ముందు నుంచే ఈ దందా మొదలయింది. లేని రోగులను సృష్టించి వారికి వైద్యం పేరుతో దొంగ బిల్లులు వేసి ముఖ్యమంత్రి సహాయ నిధిని స్వాహా చేశారు సదరు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు. అయితే కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు తమ ప్రమేయం ఏదీ లేదని..తమ వద్ద పనిచేసే కొందరు వైద్యులు చేసిన నిర్వాకం ఇది అంటున్నారు.


ప్రభుత్వ అధికారుల పాత్ర

ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా ఇలాంటి స్కాములు జరిగే అవకాశం లేదు. ఇప్పుడు దీని వెనక ఉన్న ఉన్నత స్థాయి వైద్యాధికారులు ఎవరు? అనేది కూడా ఎంక్వయిరీ మొదలు పెట్టారు సీఐడీ అధికారులు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్ రావు వద్ద డీటీపీ ఆపరేటర్ గా పనిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులో తీసుకున్నారు.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×