Sircilla Crime: మనిషి పైశాచికత్వానికి పరాకాష్ట ఈ ఘటన.. మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి.. క్షణికావేశం నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. దీని వల్లే ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పసి పిల్లలు అనాథలుగా మిగిలిన సంఘటనలెన్నో సమాజంలో ఉన్నాయి. మనసు లోతుల్లో పునాదుల్లా బలంగా పాతుకుపోయిన.. ద్వేషం, క్షణికావేశం ఇతర కారణాలతో నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మనిషిలో మానవత్వం నశించి క్రూర మృగాల్లా మారిపోతున్నారు. వీళ్లు కూడా మనలాంటి సాటి మనుషులేగా అని ఆలోచించకుండా పరిగెత్తించి చంపిన ఘటనలు నిత్యం సమాజంలో జరుగుతున్నాయి. ఇలాంటి ఘటన రాజన్న సిరిసిల్లాలో చోటుచేసుకుంది. మహిళను నోటితో కొరికి హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్ అనే యువకుడు .
వివరాల్లోకి వెళ్తే.. రేఖ అనే వివాహితను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్. రేఖ ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ ఆమెను చంపేసి, అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. రేఖను హత్య చేయకముందు కూడా తీవ్రంగా గాయపరిచాడు శ్రీకాంత్.
అయితే హత్యే కాకుండా రేఖపై అత్యాచారం కూడా చేశాడని ఆరోపిసున్నారు కుటుంబ సభ్యులు. రేఖ భర్త కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసమని దుబాయ్‌కి వెళ్లాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్ల ఇంటికి ఎదురుగానే భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు శ్రీకాంత్. అసలు రేఖను ఎందుకు చంపాడు.. తనెందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వీరిద్దరి మృతితో కన్నీరుమున్నీరవుతున్నాయి రెండు కుటుంబాలు.
గజసింగవరంలో శ్రీకాంత్, రేఖా ఇద్దరూ ఫ్యామిలీ ఎదురెదురుగానే ఉంటున్నారు. శ్రీకాంత్ భార్య, రేఖా ఇల్లు ఒకచోటే ఉండటంతో వీరిద్దరు క్లోజ్‌గా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. నిన్న ఉపాదిహామి పనుల నిమిత్తం వెళ్లిన రేఖా.. మధ్యాహ్నం సమయం లోపల పనులు ముగించుకొని ఇంటికి వచ్చింది. ఆ తర్వాత బీడీల ఆకుల కోసం.. రేఖా బీడీ కంపెనీకు వెళ్లేందుకు .. శ్రీకాంత్ భార్యను కూడా తోడు తీసుకెళ్లాలని అతని ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తాగిన మత్తులో ఉన్న శ్రీకాంత్.. విచక్షణ కోల్పోయి రేఖను బలవంత పెట్టి.. శరీర భాగాలను కొరుకుతూ.. మానభంగం చేశాడని.. కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆపై కొడవలితో నరికి చంపినట్లు తెలిపారు. అనంతరం శ్రీకాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: ప్రియుడతో రొమాన్స్ కోసం.. భర్తను వేటకొడవలితో చంపి, ఆపై..
రాజన్న సిరిసిల్లాలో ఈ ఘటన.. చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో విస్తరింపేలా చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమా లేక తాగిన మైకంలో ఈ ఘటనకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.