Rangareddy Crime News: నాలుగు గోడల మధ్య ప్రియుడితో ఆట పాటలకు భర్త అడ్డువస్తున్నాడని భావించింది భార్య. ఈ విషయాన్ని ప్రియుడితో చెప్పింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పింది. తమ రొమాన్స్ పండాలంటే భర్తను చంపడం ఒక్కటే మార్గమని సలహా ఇచ్చాడు. దాన్ని ఫాలో అయ్యింది భార్య. ఫుల్‌గా మద్యం తాగించారు. ఆపై వేటకొడవలితో గొంతు కోసి చంపేసింది. పైగా డెడ్‌బాడీని నిర్మానుష్యమైన ప్రాంతంలో కాల్చివేశారు. సంచలనం రేపిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
మేకను కోసినట్టుగా ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు తమ భర్తల గొంతు కోసి చంపేస్తున్నారు. అఫ్‌కోర్స్ కారణాలు ఏమైనా కావచ్చు. అగ్నిసాక్షిగా నిండు నూరేళ్లు జీవస్తామని తాళికట్టించుకుంటున్నారు. చివరకు చిన్ని చిన్న మనస్పర్థల కారణంగా ఈ లోకం నుంచి పంపిస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో అదే జరిగింది.
స్టోరీ ఏంటి?
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చిన్నచిల్కమర్రి గ్రామంలో దారుణం జరిగింది. ఈ గ్రామానికి చెందిన 32 ఏళ్ల యాదయ్యకు మౌనిక అనే యువతికి దాదాపు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలు పెరగడంతో యాదయ్యకు సమస్యలు మొదలయ్యాయి. చివరకు మనశ్శాంతి కోసం తాగుడుగు బానిసయ్యాడు.
మద్యం మత్తులో భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఇంటి అవసరాల తీరక మౌనిక స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనికి వెళ్లడం మొదలైంది. అదే సమయంలో మౌనికకు ఆటోడ్రైవర్ అశోక్ పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. చివరకు వివాహేతర సంబంధానికి దారితీసింది. తన ఫ్యామిలీ విషయాలను ప్రియుడికి వివరించింది. తాగి వచ్చి భర్త తనను కొడుతున్నాడని లవర్ అశోక్‌కు వివరించింది.
ALSO READ: రైలు నుంచి విసిరిన వాటర్ బాటిల్, ఆపై బాలుడు మృతి, లోకో పైలట్‌పై కేసు
వివాహేతర సంబంధం
మన బంధం కంటిన్యూ కావాలంటే భర్తను చంపేయడమే మార్గమని సలహా ఇచ్చాడు. యాదయ్యని చంపాలని ఇద్దరు డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 18న యాదయ్యను తన బాబాయి ఊరులో ఓ ఫంక్షన్ కోసం తీసుకెళ్లాడు అశోక్. వెంట మౌనిక కూడా ఉంది. అటు నుంచి తిరుగు ప్రయాణంలో రాత్రి 11 గంటలు గడిచింది. రోడ్డు పక్కన ఆటో ఆపాడు అశోక్. అక్కడే యాదయ్యకు మద్యం తాగించారు.
మత్తులోకి వెళ్లిన యాదయ్యను అశోక్-మోనిక వేట కొడవలితో గొంతు కోసి హత్య చేశారు. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను యాదయ్య డెడ్ బాడీపై పోసి కాల్చేశారు. పైని ఏమీ తెలియనట్టు వ్యవహరించారు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 19న భర్త యాదయ్య కనిపించలేదని మోనిక షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోనిక చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది మౌనిక.
ఎలా పట్టుబడ్డారంటే
అశోక్‌తో కలిసి పట్టణంలోని అయ్యప్ప కాలనీలో సహజీవనం చేస్తోంది. వీరిపై అనుమానం వచ్చిన పోలీసులు, ఈనెల 23న స్టేషన్‌కు పిలిపించి విచారించారు. తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టేసరికి గుట్టు మొత్తం విప్పేశారు. తామే చంపినట్లు మౌనిక-అశోక్ ఒప్పుకున్నారు. యాదయ్య శవాన్ని వెలికి తీసి చూసేసరికి ఎముకలు మాత్రమే కనిపించాయి. నిందితులు నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారిని రిమాండ్‌కు తరలించారు.