Kashmir Protest Pahalgam| కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన దారుణ ఉగ్రవాద ఘటనకు వ్యతిరేకంగా కశ్మీరీ ప్రజలు భారీగా నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా పోస్ట్ చేసిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. అందులో ఓ యువకుడు భావోద్వేగంగా మాట్లాడాడు.
పహల్గాం బాధితులకు, భారతీయులకు చేతులు జోడించి క్షమాణలు కోరాడు. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయినవారి కుటుంబాలకు తాము అండా ఉన్నామని.. ఉగ్రవాదాన్ని సమర్థించే రాక్షసులకు తాము వ్యతిరేకమని అన్నాడు. పహల్గాంలో చనిపోయిన అమాయక పర్యాటకులను చూసి తన గుండె బరువెక్కిందని.. అందులో ఓ మహిళ తన భర్తను పోగొట్టుకొని ఏడుస్తుండడం చూసి ఆమె తన సోదరిగా భావించానని.. తాను నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు క్షమించమని కోరాడు.
“పర్యటక రంగానికి కశ్మీర్ ప్రపంచస్థాయిలో ప్రాచుర్యం పొందింది. కానీ ఆ ఉగ్రవాదులు రాక్షసుల కారణంగా జనం భయపడుతున్నారు.. కానీ కశ్మీరీలు ఉగ్రవాదులకు వ్యతిరేకం. వారు ఏ మతానికి చెందినవారు కాదు. వారి నీచ చర్యల వల్ల మమ్మల్ని అనుమానించ వద్దు. భారతీయులంటే మేము ఎంతో ప్రేమిస్తాం. పహల్గాంలో ఆ ఉగ్రవాదుల హత్యల వీడియోలు చూసిన తరువాత నాకు భోజనం చేయడానికి మనసు రావడం లేదు. బాధిత కుటుంబాలకు, మొత్తం భారతీయులందరికీ చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను.” అని చెప్పాడు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు చనిపోయారు. దీంతో కశ్మీర్ లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని మతాల వారు, లాయర్లు, ఇతర వృత్తుల వారు రోడ్డుపై వచ్చి నిరసనలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని శ్రీ నగర్ లో, పహల్గాంలో ఈ నిరసనలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం కశ్మీర్ లో బంద్ కొనసాగుతోంది. జమ్మూలో కొనసాగుతున్న ఈ బంద్ కు అన్ని రాజకీయ, వ్యాపార, సామాజిక సంఘాలు మద్దతు తెలిపాయి.
Also Read: ఇండియా vs పాకిస్తాన్.. యుద్ధం జరిగితే.. ఎవరి బలం ఎంత?
బాధితులకు న్యాయం చేయాలని ఉగ్రవాదులను మరణ శిక్ష విధించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్ లో శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో అక్కడ కేంద్రం ప్రభుత్వం భారీ స్థాయిలో పారామిలిటరీ బలగాలు, అదనపు పోలీసు బలగాలను మోహరించింది. బంద్ కారణంగా దుకాణాలు, రవాణా , మార్కెట్లు మూసివేయడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జమ్మూ నగరంలో అయితే పెట్రోల్ పంప్ లు కూడా బంద్ చేశారు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నిత్యావసరాల సరుకుల కోసం కొన్ని దుకాణాలు తెరిచి ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట బస్సులు కూడా చాల తక్కువ సంఖ్యలో నడపబడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు తెరిచే ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లన్నీ బంద్ ప్రకటించాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బంద్ కు కశ్మీర్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.