BigTV English

Looteri Dulhan: నకిలీ పెళ్లికొడుకు వేషంలో పోలీస్.. ఆ యువతిని ఏం చేశాడంటే

Looteri Dulhan: నకిలీ పెళ్లికొడుకు వేషంలో పోలీస్.. ఆ యువతిని ఏం చేశాడంటే

Looteri Dulhan| ఒక పోలీస్ కానిస్టేబుల్ తనకు పెళ్లికావడం లేదని, పెళ్లి సంబంధం చూడాలని ఒక వివాహాలు చేసే ఏజెంట్ వద్దకు వెళ్లాడు. ఆ తరువాత ఆ ఏజెంట్ ఒక యువతితో వివాహం చేయించేందుకు ఏర్పాట్లు చేయించాడు. వివాహ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్స్ కూడా రెడీ చేశాడు. కానీ పోలీసులు వచ్చి ఆ ఏజెంట్ తో పాటు ఆ పెళ్లి కూతురునీ అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ నగరానికి చెందిన విష్ణు శర్మ అనే యువకుడు తన ఇంట్లో దొంగతనం జరిగిందని పది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏప్రిల్ 20, 2025న విష్ణు శర్మకు అనురాధ అనే యువతితో పెళ్లి జరిగింది. విష్ణు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అతను ఒక తోపుడు బండి పెట్టుకొని చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. పెళ్లి చేసుకునేందుకు అతను అప్పు చేశాడు. అయితే అతని పెళ్లి జరిగిన తరువాత రోజూలాగే పనికి వెళ్లేవాడు. రెండు రోజుల తరువాత ఒక రాత్రి పనినుంచి ఇంటి వచ్చాడు. భోజనం చేసిన తరువాత వెంటనే నిద్ర పోయాడు. ఆ రాత్రి అతడికి బాగా గాఢ నిద్ర పట్టింది. అయితే అదే అతను చేసిన తప్పు.. ఎందుకంటే ఉదయం లేటుగా నిద్రలేచిన విష్ణు శర్మ ఇంట్లో దృశ్యాలు చూసి షాక్ కు గురయ్యాడు. ఎందుకంటే ఇంట్లో నుంచి అతని కొత్త మొబైల్ , రూ.30,000 నగదు, రూ.1.25 లక్షల బంగారం చోరీ అయింది. అయితే ఇంట్లో అతని భార్య కనిపించడం లేదు. రోజంతా తన భార్య అనురాధ కోసం వెతికాడు. కానీ ఆమె కనిపించక పోవడంతో

విష్ణు శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అయితే అతని భార్య అనురాధ గురించి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అనురాధ గురించి రాజస్థాన్, మధ్య ప్రదేశ్, బిహార్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఆమె మరెవరో కాదు పెళ్లిళ్లు చేసుకొని ఆ తరువాత భర్త ఇంటి నుంచి దొంగతనాలు చేసి పారిపోయేది. ఇదంతా తెలిసి రాజస్థాన్ పోలీసులు ఆమెను పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేశారు. అనురాధ.. మధ్య ప్రదేశ్ రాజధాని బోఫాల్ లో ఉండవచ్చనే సమాచారం అందడంతో పోలీసులు అమె కోసం గాలించారు. కానీ ఆచూకీ తెలుసుకునేందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ కాబోయే పెళ్లి కొడుకుగా వేషం మార్చారు. ఆ తరువాత అనురాధకు సాయం చేసే ఒక ఏజెంట్ ని మారువేషంలో కలిసి అతని కోసం పెళ్లి సంబంధం చూడాలని చెప్పారు. ఆ ఏజెం రూ.2 లక్షలు తీసుకొని నేరుగా అనురాధతోనే పెళ్లి నిశ్చయించాడు. తీరా పెళ్లి జరిగే సమయంలో ఆమెను పట్టుకున్నారు.


Also Read: వివాహం జరిగిన వారం రోజులకే మూడో భార్యను చంపిన భర్త.. ఏం జరిగిందంటే?..

అనురాధ పాస్వాన్ (32), మొత్తం 25 మంది ధనికులను, మధ్య తరగతి యువకులను పెళ్లి పేరుతో దోచుకుంది. పెళ్లి తరువాత వారితో నమ్మకంగా, ప్రేమగా నటించి కొన్ని రోజులకే వారికి భోజనంలో మత్తు మందు పెట్టి.. ఇంట్లోని ధనం, బంగారం, విలువైన వస్తువులన్నీ దోచుకునేది. ఆమెకు తోడుగా ఆ ఇంటి పరిసరాల్లోనే ఆమె ముఠా సభ్యులు ఉంటూ సాయం చేసేవారు. రాజస్థాన్ పోలీసులు అనురాధ, అమె గ్యాంగ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×