Nindu Noorella Saavasam Serial Today Episode : అమర్, రాథోడ్ కారులో వెళ్తుంటే.. ఎవరో రాథోడ్‌కు ఫోన్ చేసి రణవీర్ సిటీలోకి వచ్చాడని చెప్తాడు. అదే విషయం రాథోడ్, అమర్‌కు చెప్తాడు. అమర్ షాక్ అవుతాడు. ఎప్పుడు వచ్చాడు.. అని అడుగుతాడు. రెండు గంటల క్రితమే వచ్చాడట సార్ అని రాథోడ్ చెప్తాడు. దీంతో అమర్ అనుమానంగా రణవీర్ ఎందుకు మళ్లీ మళ్లీ హైదరాబాద్ వస్తున్నాడు. రణవీర్‌కు ఇక్కడ ఏం పని అని అడుగుతాడు. అయితే తన పాప కోసం వస్తున్నానని చెప్పాడు కదా సార్ అంటాడు రాథోడ్. పాపం కోసం వచ్చే వాడు కానీ ఇప్పుడు వస్తుంది తన పాప కోసం తను చాలా రోజుల ముందే పాప గురించి వెతకడం ఆపేశాడనిపిస్తుంది. మనం కోల్ కతా వెళ్లినప్పుడు కూడా రణవీర్‌లో ఏదో కంగారు కనిపించింది. నన్ను చూసి ఎందుకు అక్కడ అలా కంగారు పడి ఉంటాడు అనగానే..
సార్ సిటీకి ఎందుకు వచ్చాడో ఓ సారి ఫోన్ చేసి కనుక్కుంటే అంటాడు రాథోడ్. కనుక్కోవాలి కానీ ఫోన్ చేసి కాదు.. నువ్వు రణవీర్‌ను ఫాలో చేయ్.. అని చెప్తాడు. రాథోడ్ షాక్ అవుతాడు. అవును రాథోడ్ నా ఫ్యామిలీకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే.. ముందు నా ఫ్యామిలీ చుట్టు ఉన్న వాళ్ల లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలియాలి రాథోడ్. ప్రమాదం పక్కనే ఉంది. అది ఎవరి రూపంలో ఉందో తెలిసే వరకు అందరినీ అనుమానించక తప్పదు. మన టీంకు చెప్పాను రణవీర్ కారును ట్రాక్ చేసి చెప్తారు. నువ్వు రణవీర్‌ను ఫాలో అయి ఎక్కడికి వెళ్తున్నాడో.. ఎవ్వరిని కలుస్తున్నాడో తెలుసుకో.. కానీ ఎక్కడా రణవీర్‌కు అనుమానం రాకూడదు అని అమర్ చెప్పగానే.. రాథోడ్ ఓకే సార్ అంటాడు.
మనోహరి పిల్లలను ఎగ్జిబిషన్‌కు వెళ్లేలా రెచ్చగొడుతుంది. పిల్లలు వెళ్లి మిస్సమ్మతో చెప్తారు. మిస్సమ్మ అమర్ దగ్గరకు వెళ్లి పిల్లలను ఎగ్జిబిషన్ కు తీసుకెళ్లడానికి ఒప్పిస్తుంది. పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు. దూరం నుంచి అంతా చూస్తున్న మనోహరి.. అమర్ చేత మెడ పట్టి బయటకు గెంటించుకోవడానికి ఎంత కష్టపడ్డావే.. ఇవాళ రణవీర్ అంజలిని తీసుకెళ్లగానే అదంతా నీవల్లే జరిగిందని అమర్ అనుకునేలా చేసి నిన్ను బయటకు గెంటించి.. నీ పోస్టులో నేను సెటిల్ అవుతాను అనుకుంటూ హ్యాపీగా లోపలికి వెళ్లి రణవీర్‌కు కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన రణవీర్ ఏంటి మనోహరి అంజలిని నాతో పంపించడం కుదరదు అని చెప్పడానికి ఫోన్ చేశావా అని అడుగుతాడు.
దీంతో మనోహరి కాదు సాయంత్రం అందరం ఫ్యామిలీతో ఎగ్జిబిషన్‌కు వస్తున్నాం. అంజలిని తీసుకెళ్లి పోవడానికే నీకు ఫోన్ చేశాను అంటుంది మనోహరి. దీంతో రణవీర్ వావ్ నువ్వు ప్రెషర్‌లో కూడా ఇంత ఫాస్ట్‌గా పని చేస్తావని తెలిసి ఉంటే.. నేను వచ్చినప్పటి నుంచే.. నీ మీద ప్రెషర్ పెడుతూ ఉండేవాడిని కదా అంటాడు. దీంతో మను అంజలిని తీసుకెళ్లడానికి సాయం అడిగావు చేశాను. సాయంత్రం నువ్వు ఆ పిల్లను తీసుకెళ్లకపోతే నాకు సంబందం లేదు. మళ్లీ నన్ను అడగొద్దు.. పక్కాగా ప్లాన్ చేసుకుని రా.. అని చెప్తుంది. దీంతో రణవీర్ అరే నాకోసం ఇంత చేస్తున్న నిన్ను ఏమంటాను మనోహరి.. ఇవాళ్టీతో నా సమస్యకు పర్మినెంట్ సమాధానం దొరకబోతుందన్న మాట థాంక్యూ సాయంత్రం మీరు బయలుదేరే ముందు నాకు ఫోన్ చేయ్.. అంటాడు రణవీర్ సరే కానీ అంతలోపు నువ్వు నాకు ఓ సాయం చేయాలి అని మనోహరి అడుగుతుంది. దీంతో రణవీర్ అడుగుతున్నావా..? ఆర్డర్ వేస్తున్నావా..? మనోహరి అంటాడు.
దీంతో మనోహరి అడుగుతున్నాను.. అయినా నేను చేసిన హెల్ప్‌కు రిటర్న్ అడుగుతున్నాను అంతే అంటుంది. రుణం తీర్చుకోమంటున్నావు సరే చెప్పు ఏం చేయాలో అని రణవీర్ చెప్పగానే.. మనోహరి బాధగా నన్ను ఒకడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పాను కదా వాడు చిత్ర అయ్యుండొచ్చు అని అనుమానంగా ఉంది. అని చెప్పగానే. రణవీర్ వాడు అంటున్నావు.. అమ్మాయి పేరు చెప్తున్నావు అని అడుగుతాడు. అంటే వాయిస్ మ్యాడులేషన్ యాప్ వాడుతుందేమోనని డౌటుగా ఉంది. అందుకే ఇవాళ చిత్రకే డబ్బులు ఇచ్చి బ్లాక్ మెయిలర్‌కు ఇవ్వమని ఇచ్చాను.. ఇప్పుడే చిత్ర వెళ్లిపోతుంది. నువ్వు వెంటనే చిత్రను ఫాలో అవ్వు అని మనోహరి చెప్పగానే.. రణవీర్ సరే చేస్తాను కనుకుంటాను అని చెప్పి పోన్ కట్ చేస్తాడు. మనోహరి కోపంగా చిత్ర నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది నువ్వే అని తెలియాలి ఈ భూమ్మీద ఇవాలే నీకు ఆఖరి రోజు అని ఇరిటేటింగ్ అవుతుంది.
డబ్బులు తీసుకుని వెళ్లిన చిత్రను మిస్సమ్మ ఆటోలో, రణవీర్ కారులో ఫాలో అవుతతుంటారు. రణవీర్‌ను రాథోడ్, అమర్ ఫాలో అవుతుంటారు. ఆటోలో వెళ్తున్న చిత్ర ఒక బస్టాండ్ దగ్గర ఆటో దిగి బస్టాండ్ లోకి వెళ్తుంది. అక్కడే రణవీర్ కారు దిగి చిత్ర వైపు వెళ్తుంటారు. ఇంతలో అమర్ వచ్చి కారు దిగి రణవీర్ వైపు వెళ్తుంటాడు. ఆటోలో ఉన్న మిస్సమ్మ రణవీర్, అమర్ వాళ్లను చూసి షాక్ అవుతుంది. అసలు ఏం జరిగుతుంది ఇక్కడ ఆయన ఎందుకు వచ్చారు అని అనుమానపడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?