E-Paper
Advertisement

Romantic Movie OTT : కెరీర్ కోసం పుట్టుకొచ్చే ప్రేమ… ట్రయాంగిల్ లవ్ లో క్రేజీ క్లైమాక్స్… ఈ తరం యూత్ స్టోరీ

Romantic Movie OTT : కెరీర్ కోసం పుట్టుకొచ్చే ప్రేమ… ట్రయాంగిల్ లవ్ లో క్రేజీ క్లైమాక్స్… ఈ తరం యూత్ స్టోరీ
Advertisement

Romantic Movie OTT : ఓ మంచి లవ్ స్టోరీ చూడాలని ఎవరికైనా ఉంటుంది. ఇక అలాంటి స్టోరీలు రెండు గంటల సేపు కుర్చీల్లో కూర్చోబెట్టేస్తుంటాయి. ఈ నేపథ్యంలో రొమాంటిక్ లవర్స్ ను ఒక మూవీ బాగా ఆకట్టుకుంది. ప్రేమ, కెరీర్ మధ్య నలిగిపోయే నేటి యువత కష్టాలను ఈ సినిమా అద్దం పట్టినట్లు ఉంటుంది. ఇందులో క్లైమాక్స్ సీన్స్ కు కన్నీళ్లు పక్కాగా వస్తాయి. ఈ హార్ట్ టచింగ్ మూవీ పేరు ఏమిటి? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే ..

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘లాస్టింగ్ మోమెంట్స్’ (Lasting Moments). ఇందులో జెఎమ్ డి గుజ్మాన్, రామిరెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఫిఫ్త్ సోలమన్ దర్శకత్వం వహించారు. ఆయన ఈ సినిమాకు కథను కూడా అందించారు. ప్యాషన్ 5 స్టూడియోస్ నిర్మించింన ఈ సినిమా 2025 జూలై 30న ఫిలిప్పీన్స్‌లో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అకి, ప్రియ ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకునే ఒక జంట. ప్రియా వాళ్లది పేద కుటుంబం కావడంతో, ఎలాగైనా డబ్బు సంపాదించి సెటిల్ అవ్వాలని ఆమెకు కసి ఉంటుంది. ఆ టైంలో సింగపూర్‌లో మంచి జీతంతో ఉద్యోగం వస్తే, అకిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అకి ఆమెను వెళ్లొద్దని బ్రతిమిలాడినా, తన భవిష్యత్తు కోసం కఠినంగా నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడ కార్లోతో ఆమెకు పరిచయం పెరుగుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుంది. ఒకానొక దశలో ప్రియ తన పాత ప్రేమికుడు అకిని దాదాపు మర్చిపోయి, కార్లోతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటుంది. అయితే ఐదేళ్ల తర్వాత కార్లోతో కలిసి ఉన్నప్పటికీ, ఆమె మనసులో ఏదో వెలితిగా అనిపిస్తుంది. తన పాత జ్ఞాపకాలు, అకి మీద ఉన్న ప్రేమ మళ్ళీ గుర్తొచ్చి అతన్ని వెతుక్కుంటూ ఊరికి తిరిగి వస్తుంది.

అయితే ఈ మధ్య కాలంలో ప్రియ వెళ్ళిపోయాక అకి తట్టుకోలేకపోతాడు. ఆమె జ్ఞాపకాల్లో పిచ్చోడైపోయి డ్రగ్స్‌కి బానిసవుతాడు. అదే టైంలో అతనికి ఒక దారుణమైన అల్జీమర్స్ జబ్బు వస్తుంది. దీనివల్ల అతను చిన్న వయసులోనే అన్నీ మర్చిపోతుంటాడు. ఇక ఆమె తిరిగి వచ్చాక అకిని చూసి షాక్ అవుతుంది. తను ప్రాణంగా ప్రేమించిన అకికి ఇప్పుడు తనేవరో గుర్తుండదు. తను చేసిన తప్పు వల్ల ఒక మంచి మనిషి జీవితం ఇలా అయిపోయిందని ఆమె కుమిలిపోతుంది. తనను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ప్రియుడిని చూస్తూ, ఆమె పడే ఆవేదనతో సినిమా ముగుస్తుంది.

Advertisement

Read Also : అంధకారాన్ని జయించే అభిమన్యుడు… చావులోనూ చెరగని చిరునవ్వు… హార్ట్ టచింగ్ స్టోరీ

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×