Medchal News: న్యాయం చేస్తానన్నాడు ఆ కానిస్టేబుల్. నిజమేనని నమ్మింది ఆ యువతి. చివరకు గర్భవతిని చేశాడు. ఆ తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడు. యువతి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో పలుమార్లు ఆమెపై దాడికి సైతం పాల్పడ్డాడు. సీన్ రివర్స్ అయ్యింది. చివరకు జైలుకి వెళ్లాడు.
కనిపిస్తున్న వ్యక్తి పేరు సుధాకర్‌రెడ్డి. మేడ్చల్ రూరల్‌లోని ఓ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. తమ సమస్యలను చెప్పుకోవడానికి స్టేషన్‌కు పదుల సంఖ్యలో బాధితులు వస్తుంటారు. వారి వీక్ నెస్‌ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడాయన. మేడ్చల్ లోని ఇందిరానగర్ కాలనీలో ఉంటోంది 31 ఏళ్ల యువతి.
డబ్బుల విషయంలో కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ గతేడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ సమస్యను చిటికెలో పరిష్కరిస్తానని ఆ యువతి హామీ ఇచ్చాడు కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డి. ఆ తర్వాత యువతి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. కేసు విషయమై ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు.
యువతికి మ్యారేజ్ కాలేదని తెలుసుకున్నాడు. తన మాయమాటలతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విధంగా పలుమార్లు అత్యాచారం చేశాడు. సీన్ కట్ చేస్తే.. జులైలో ఆమె గర్భవతి అయ్యింది. విషయం తెలుసుకున్న వెంటనే అబార్షన్ చేయించాడు. ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
ALSO READ: చనిపోమంటూ విషం ఇచ్చిన యువకుడు.. ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియురాలు
బాధిత యువతికి ఓ కొత్త విషయం తెలిసింది. కానిస్టేబుల్‌కి మ్యారేజ్ అయ్యిందని తెలుసుకుంది. ఆ తర్వాత అతడ్ని నిలదీసింది. ఆమెని అడ్డుతొలగించుకునేందుకు రకరకాల స్కెచ్‌లు వేశాడు. ఏమీ ఫలించలేదు. చివరకు యువతిపై దాడి చేశాడు సుధాకర్‌రెడ్డి. ఈ వ్యవహారం స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తెలిసింది.
వెంటనే అక్కడి నుంచి సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. అయినా సుధాకర్ లో ఎలాంటి మార్పు రాలేదు. చివరకు చేసేదేమీ లేక ఫిబ్రవరి మూడున సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసింది బాధిత యువతి. దీనిపై డిపార్టుమెంటల్ ఎంక్వైరీ చేశారు. సుధాకర్ తప్పుచేశాడని తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్‌ను రిమాండ్ కు తరలించారు.