Kakinada Love Suicide | చదువుకునే సమయంలో ప్రేమ పేరుతో ఒక యువతిని వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. తర్వాత వివాహం చేసుకోమని అడిగితే తాను ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు అంగీకరించడం లేదని చెప్పాడు. చివరికి ఆ యువతిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రోత్సహించాడు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈ ఘటన కాకినాడ జిల్లా ప్రతిపాడులో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి డిగ్రీ చదువుకొని స్థానికంగా ఒక క్లినిక్ లో ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమె ఇంటర్ చదివే సమయంలోనే కారసాల రాజారావు అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడి వేధించాడు. రోజూ తన వెంట పడే సరికి.. ఆమె కూడా కొంత కాలానికి తిరిగి ప్రేమించింది. ఆ సమయంలో అతనికి ఉద్యోగం కూడా లేదు. అలా రెండు సంవత్సరాలు ప్రేమించుకున్నాక.. ఆమె ఇక వివాహం చేసుకుందామని ప్రస్తావించింది. కానీ అతను ఏదైనా ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రాజారావుకు సచివాలయంలో ఉద్యోగం వచ్చాక.. ఇద్దరం జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకుందామని చెప్పాడు.
ఈ క్రమంలో రాజారావు ఆమె చదువుతున్న కళాశాల వద్దకు వెళ్లేవాడు. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. 2024లో డిగ్రీ పూర్తి చేసుకున్న యువతి గుంటూరులోని ఒక క్లినిక్‌లో ఉద్యోగంలో చేరింది. అక్కడకు కూడా అతను వచ్చేవాడు. యువతి పెళ్లి విషయం అడిగితే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నందున ఎక్కువ కట్నం వస్తుందని, తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి.
Also Read: గురువులు కాదు మృగాలు.. విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు సామూహిక అత్యాచారం
యువతి ఉద్యోగం చేస్తున్న క్లినిక్ కు ఈ ఏడాది జనవరి 15న రాజారావు వెళ్లాడు. పెళ్లి విషయంపై మళ్లీ ఇద్దరూ గొడవపడ్డారు. తనను శారీరకంగా అనుభవించి ఇప్పుడు పెళ్లిచేసుకోకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించింది. కానీ రాజారావు పెళ్లి కుదరనిపని అని తెగేసి చెప్పాడు. దీంతో ఆ యువతి పెళ్లి చేసుకోకపోతే తనకు చావే గతి అని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇది విని రెండు ఎలుకల మందు పేస్టులు తెచ్చి యువతికి చనిపోమని ఇచ్చాడు. ఆమెకు ధైర్యం లేకపోతే తనే సహాయం చేస్తానని.. యువతి చేతిని కత్తితో కోశాడు. ఆ తరువాత ఎలుకల మందు తిన్నాక తనకు మెసేజ్ చేయాలని అక్కడి నుంచి రాజారావు వెళ్లిపోయాడు. యువతి ఎలుకల మందు తిన్నాక రాజారావుకు మెసేజ్ చేసి.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కాగా అతను మెసేజ్ చూసి.. యువతి బంధువైన మరో మహిళకు ఆ మెసేజ్ పంపాడు.
ఆమె ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం వారు బాధితురాలిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి చికిత్స అందించారు. తర్వాత బాధిత యువతి జరిగిన ఘటనలను తల్లిదండ్రులకు చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై రాజారావు తల్లిదండ్రులను ప్రశ్నించగా చంపుతామని బెదిరిస్తున్నారని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.