BigTV English

Naga Chaitanya: చైతూపై విమర్శలు.. శోభితాకో న్యాయం? సమంతాకో న్యాయమా?

Naga Chaitanya: చైతూపై విమర్శలు.. శోభితాకో న్యాయం? సమంతాకో న్యాయమా?

Naga Chaitanya:నాగచైతన్య (Naga Chaitanya).. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2023లో చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో తండేల్ (Thandel) సినిమాను ప్రారంభించారు. ఇక ఎట్టకేలకు ఈ రోజు విజయవంతంగా థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. ఇక ఈ సినిమా ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్న నాగచైతన్య.. శోభిత నటించిన సినిమాల గురించి, ఆమె పాత్రల గురించి చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇక ఈ విషయం విన్న సమంత అభిమానులు శోభితాకో న్యాయం ? సమంతాకో న్యాయమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగచైతన్య తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


శోభిత నటనపై చైతూ ప్రశంసలు..

ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా.. వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్న నాగచైతన్య, శోభిత నటించిన సినిమాలలో తన ఫేవరెట్ సినిమాల గురించి కూడా తెలిపారు. నాగచైతన్య మాట్లాడుతూ.. “శోభిత నటించిన మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ తో పాటు మేజర్ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని” తెలిపారు. వాటిల్లో తన భార్య చాలా బాగా నటించిందని పేర్కొన్నారు. ఇకపోతే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడవి శేషు (Adavi Shesh) హీరోగా వచ్చిన మేజర్ సినిమాలో శోభిత కీలక పాత్ర పోషించింది. రియల్ లైఫ్ పాత్ర స్ఫూర్తితో రాసుకున్న ప్రమోద రెడ్డి అనే క్యారెక్టర్ లో మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచింది. ఇందులో ఈమె నటనకు ప్రశంసలు కూడా లభించాయి. అంతేకాదు ఈ పాత్రకు శోభిత తప్ప.. మరెవరూ న్యాయం చేయలేరు అనేలా అద్భుత నటన కనబరిచింది. ఇక మహేష్ బాబు సొంత ప్రొడక్షన్లో రూపొందిన ఈ సినిమా 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


చైతూ పై విమర్శలు గుప్పిస్తున్న సమంత ఫ్యాన్స్..

అలాగే ఈ సినిమా కంటే ముందు 2019లో శోభిత ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే సీరీస్ లో నటించినా.. ఇది కూడా ఆమెకు మంచి గుర్తింపు అందించింది. ఇందులో బాలీవుడ్ యాక్టర్ జిమ్ సరభ్ తో కాస్త హద్దు మీరి మరీ నటించింది శోభిత. అయితే నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత చైతూ యాంటీ ఫ్యాన్స్ ఎక్కువగా ఈ వీడియో క్లిప్పింగ్స్ ని సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తూ వైరల్ చేశారు. అయితే ఇలాంటి వెబ్ సిరీస్ తనకు బాగా నచ్చిందని, శోభిత యాక్టింగ్ బాగుందని చైతూ చెప్పడంతో ఇప్పుడు నాగ చైతన్య పై విమర్శలు గుప్పిస్తున్నారు సమంత అభిమానులు. ఎందుకంటే సమంతను ఏడేళ్లు ప్రేమించి, నాలుగేళ్ల వైవాహిక బంధం తర్వాత ఆమెతో విడిపోయారు నాగచైతన్య. ఇకపోతే వివాహమైన తర్వాత సమంత ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ లో కాస్త గ్లామర్ డోస్ పెంచి నటించింది ఈ పాత్ర చేయడం నాగచైతన్యకు ఇష్టం లేదట. అయినా సరే తన కెరియర్ కోసం చూస్తున్న సమంత ఈ పాత్ర చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆమెతో గొడవ పడి ఆమెకు విడాకులు ఇచ్చారని కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు మాత్రం శోభిత సమంతా కంటే కూడా ఎక్కువ గ్లామర్ వొలకబోసి నటించింది. కానీ ఈ పాత్ర తనకు నచ్చిందని నాగచైతన్య తెలిపారు. ఇక దీన్ని పాయింట్ గా పట్టుకొని శోభిత కి ఒక న్యాయం? సమంతా కి ఒక న్యాయమా.. దీనినే రాజు మెచ్చిన రంభ అంటారేమో అంటూ సమంత ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×