E-Paper
Advertisement

తొర్రూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి!

తొర్రూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి!
Advertisement

Mahabubabad: స్వేచ్ఛ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నారం రోడ్డులోని భద్రకాళి ఆలయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో గుర్తూరు గ్రామానికి చెందిన జడల నవీన్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ నెల్లికుదురు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కాంట్రాక్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో గడిపేందుకు తొర్రూరుకు వచ్చిన ఆయన చేపలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న నవీన్ ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Also Read: బిఆర్ఎస్ ఓట్లు లేపేయడమే కాంగ్రెస్, బిజేపి టార్గెట్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనం!

ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పి ఉండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలనికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన పెట్రోల్ ట్యాంకర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తోట మహేందర్ రెడ్డి తెలిపారు. అక్కడికి వచ్చిన యువతకు బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కచ్చితంగా ధరించి ఉంటే మృతుడు బ్రతికి ఉండేవాడు కదా అని అక్కడ ఉన్న స్థానికులను హెచ్చరించారు.

Advertisement

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ బర్త్‌డే వేళ గాంధీ భవన్‌కు 100 కంపెనీలు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×