BigTV English

Bank Manager Farmer Chicken : రూ.39000 నాటుకోడి మాంసం తిన్న బ్యాంక్ మేనేజర్.. మోసం చేశాడని రైతు ఫిర్యాదు

Bank Manager Farmer Chicken : రూ.39000 నాటుకోడి మాంసం తిన్న బ్యాంక్ మేనేజర్.. మోసం చేశాడని రైతు ఫిర్యాదు

Bank Manager Farmer Chicken | ఉన్నత పదువుల్లో ఉంటూ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడమే కాకుండా.. తమ కంటే పేదవారిని దోచుకునే దుర్మార్గులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉంటారు. అంటువంటి వారిలో ఒక మహానుభావుడి గురించి ఇక్కడ చెప్పకోవాలి. ఒక బ్యాంక్ మేనేజర్ స్థాయిలో ఉండి తన వద్దకు వచ్చిన ఒక రైతును నిలువునా దోచుకున్నాడు ఒక ప్రబుద్ధుడు. డబ్బులు దోచుకోవడం కుదరలేదు కానీ అతని వద్ద నుంచి తనకు ఇష్టమైన నాటుకోడి మాంసాన్ని ఫ్రీగా తినేశాడు. అది కూడా ఏకంగా రూ.39000 విలువ గల చికెన్ తిన్నాడట. ఈ ఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో జరిగింది.


జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ నగరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మస్తూరి బ్రాంచ్ మేనేజర్ వద్దకు దాదాపు రెండు నెలల రోజుల క్రితం రూప్ చంద్ మన్హర్ అనే ఒక చిన్న కోళ్ల ఫామ్ నడిపే రైతు వెళ్లాడు. తన కోళ్ల ఫామ్ మరింతగా పెంచేందుకు తనకు బ్యాంకు నుంచి రూ.12 లక్షల రుణం మంజూరు చేయాలని బ్యాంక్ మేనేజర్ ని కోరాడు. కానీ బ్యాంకు మేనేజర్ అతనికి రుణం మంజూరు చేయలేదు. దీంతో రైతు రూప్ చంద్ బ్యాంకు చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీంతో మేనేజర్ అతడితో ఒకరోజు పిలిచి డీల్ మాట్లాడుకున్నాడు. తాను రుణం మంజూరు చేసేందుకు.. 10 శాతం కమిషన్ (లంచం) అంటే రూ. 1.2 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. రూప్ చంద్ తన వ్యాపారం వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో వ్యాపారం విస్తరించేందుకు ఆతృతగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో లోన్ కోసం బ్యాంక్ మేనేజర్ అడిగిన 10 శాతం లంచం ఇవ్వడానికి అంగీకరించాడు. కానీ బ్యాంక్ మేనేజర్ అంతటితో ఆగలేదు. లోన్ మంజూరు చేసేందుకు చాలా పెద్ద ప్రక్రియ ఉందని.. అంతవరకు తనకు వారానికి ఒకసారి నాటుకోడి మాంసం తెచ్చి ఇవ్వాలిన అడిగాడు. రూప్ చంద్ అందుకు కూడా అంగీకరించాడు.


Also Read: 60వ గుడ్డు పెట్టిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పక్షి.. వయసు 74 ఏళ్లు!

అయితే తన పామ్ లో కోళ్ల సంఖ్య పెంచుకుందామని ఆశించిన రూప్ చంద్‌కు సీన్ రివర్స్ అయింది. తన ఫామ్ లో కోళ్ల సంఖ్య పెరగలేదు కదా.. ఇంకా తగ్గిపోయింది. ఎందుకంటే ప్రతి శనివారం బ్యాంక్ మేనేజర్ గారి కోసం రైతు రూప్ చంద్.. కిలోల లెక్క నాటు కోడి మాంసం తీసుకెళ్లి ఇచ్చేవాడు. నెలల తరబడి ఈ ప్రక్రియ ఇలాగే సాగింది. దీంతో నాటుకోడి చికెన్ బిల్లు రూ.38,900 వరకు చేరింది. కానీ బ్యాంక్ లోన్ మాత్రం మంజూరు కాలేదు. పైగా బ్యాంక్ మేనేజర్ అడిగిన రూ. 1.2 లక్షలు లంచం కూడా రూప్ చంద్ సమర్పించుకున్నాడు.

బ్యాంక్ మేనేజర్ తీరుతో రూప్ చంద్ ఓపిక నశించింది. ఒక రోజు తనకు లోన్ మంజూరు చేయాలని గట్టిగా నిలదీశాడు. అప్పుడు మేనేజర్ బ్యాంక్ రుణం రాదని చెప్పేసరికి.. రైతు రూప్ చంద్ తాను మోసపోయినట్లు గ్రహించాడు. అందుకే బ్యాంక్ మేనేజర్ పై బిలాస్ పూర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.

ఈ విషయం మీడియాకు తెలియడంతో రైతు రూప్ చంద్ విలేకరుల ముందు తన గోడు వినిపించుకున్నాడు. బ్యాంక్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని.. తనవద్ద నుంచి మేనేజర చికెన్ తీసుకున్నట్లు ఆధారాలున్నాయని తెలిపాడు. తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు.

మస్తూరి ఎస్బిఐ శాఖ ముందే పెట్రలో పోసొకొని.. నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×