trinayani serial today Episode: నయని ఒక్కతే రూంలో కూర్చుని నేత్రి గురించి తలుచుకుని బాధపడుతుంది. అమ్మవారిలో ఐక్యం అయ్యావంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలివో కదా..? అనుకుంటుంది. నీ శరీరాన్ని నాకు ఇచ్చావు కానీ ఇప్పుడు దాని వల్ల సమస్య వచ్చింది అని గుర్తు చేస్తుకుంటుంది. ఇంతలో విశాల్ వచ్చి నీ అరచేతి చూసుకుని నీకు నువ్వే జోస్యం చెప్పుకుంటున్నావా..? నయని అని అడుగుతాడు. నయని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావని విశాల్ అడుగుతాడు.
ఏం లేదని నయని చెప్పగానే కారణం లేకుండా కన్నీళ్లు రావని అడుగుతాడు విశాల్. దీంతో మీరు తప్పా ఎవరూ నన్ను నమ్మటం లేదు బాబుగారు అంటుంది. నువ్వు నువ్వే అని నేను నమ్ముతున్నాను. నీ మాట మారలేదు. నా భార్య నయని మీద ఇంకెవరూ ఆరోపణలు మోపవద్దని చెప్పాను. ఈ చేతులు నన్ను పట్టుకుని నడిపించాయి. ఈ చేతులు ఎంతో మందికి అన్నం పెట్టాయి. అలాంటి ఈ చేతులు మారిపోయాయి అంటే నేను ఒప్పుకోను అంటాడు విశాల్.
వల్లభ సీరియస్ గా ఆలోచిస్తుంటే.. తిలొత్తమ్మ వస్తుంది. మమ్మీ తను నయని కాదని త్రినేత్రి అని తేటతెల్లం అయినా విశాల్ తమ్మి నమ్మడం లేదేంటని అడుగుతాడు. దీంతో అవసరం ఉండి అలా ప్రవర్తిస్తున్నాడు. సడెన్‌గా గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఎక్కడ అనే వార్త తెలిస్తే మీడియా గోల తట్టుకోలేమని విశాల్ అలా అంటున్నాడు అని చెప్తుంది తిలొత్తమ్మ. అయితే నేను ఇంకోలా అనుకుంటున్నాను మమ్మీ ఏలాగూ నయని మరదలు లాగానే ఉంది కదా..? సాఫీగా సంసారం చేసుకుంటూ పోవచ్చు అనుకున్నాడేమో అంటాడు వల్లభ. దీంతో నీలా కకుర్తి పడే వాడు కాదురా విశాల్ నిప్పు.. అంటుంది తిలొత్తమ్మ. అందుకేనా ఎప్పుడూ వేడిగా ఉంటాడు అని వల్లభ అనగానే కోపంతో వల్లభను తిడుతుంది తిలొత్తమ్మ.
విక్రాంత్ ఫైల్ తీసుకొచ్చి విశాల్‌కు చూపిస్తూ ఈ ఫైల్ మీద నయని వదిన సంతకం పెడితే ఓఆర్‌జీ కంపెనీ నుంచి రావాల్సిన అరవై కోట్లు వస్తాయి అని చెప్పగానే మా అక్క ఒక్క సంతకానికి అంత విలువనా..? అని అడుగుతుంది సుమన. ఇంతలో దురందర వచ్చి ఏయ్ గాయత్రి అవి విలువైన పేపర్లు నువ్వు చింపేవు.. అంటుంది. పెద్దమ్మకు ఏది పనికిరానిదో తెలియకుండా ఉంటుందా..? అని వల్లభ అడుగుతాడు. ఆత్మకు తెలుస్తుందేమో కానీ చంటి పిల్లగా ఏం తెలుస్తుంది అని అంటూ తిలొత్తమ్మ విశాల్‌కు ఫైల్ ఇచ్చి ఇందలో కూడా నువ్వు ఒక సైన్ చేయ్ అని అడుగుతుంది. మీ ఆవిడ వచ్చే వరకు ఆఫీసులో తన కుర్చీలో నిన్ను పెంచిన ఈ అమ్మను కూర్చోబెడుతున్నట్లు సంతకం పెట్టమంటున్నాను అని తిలొత్తమ్మ చెప్తుంది.
అందరూ షాక్ అవుతారు. బ్రో సైన్ చేస్తే ఆఫీసులో మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోదామనా..? అని విక్రాంత్ అనగానే వల్లభ విక్రాంత్‌ను కొట్టబోతుంటే సుమన వల్లభను అడ్డగిస్తుంది. మా ఆయన మీదేంటి మీ దౌర్జన్యం అంటుంది. దీంతో విక్రాంత్, సుమనను నువ్వేమి నాకు అడ్డు రావోద్దు కానీ కామ్ గా ఉండు అంటాడు. ఇంతలో తిలొత్తమ్మ తీసుకొచ్చిన ఫైల్ మీద గాయత్రి పాప కాఫీ పోస్తుంది. దీంతో తిలొత్తమ్మ కోపంగా గాయత్రి పాపను కొట్టబోతుంటే నేత్రి ఆపుతుంది. తిలొత్తమ్మ చేయిని పట్టుకుంటుంది. తిలోత్తమ్మ షాక్ అవుతుంది. గత జన్మలో విశాల బాబుగారిని కన్నతల్లిని కొడతావా..? అంటూ తిలొత్తమ్మను దూరంగా నెట్టి వేస్తుంది.
డల్లుగా కూర్చున్న సుమన దగ్గరకు విక్రాంత్ వెళ్లి ఎందుకు అలా కూర్చున్నావు అని అడుగుతాడు. ఏ రాయి దొరక్కా అంటుంది. ఎందుకని విక్రాంత్ అడగ్గానే తలకేసి కొట్టుకుందామని సుమన అంటుంది. అయితే నేను తీసుకొచ్చి ఇస్తానుండు అంటూ విక్రాంత్ వెళ్లబోతుంటే.. ఆగవయ్యా బాబు ఏం జరగుతుందో అర్తం కానీ స్థితిలో ఉన్న భార్యను పైలోకానికి పంపిస్తామంటారేంటి..? అంటుంది. దీంతో విక్రాంత్ సుమనను కోపంగా తిడతాడు. ఇంతటితో త్రినయని సీరియల్ నేటి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?