World oldest Bird Egg| ఈ భూగ్రహం మీద ఉన్న పక్షుల్లో కెల్లా అత్యంత ముసలి పక్షి పేరు విస్డం. దాని వయసు 74 ఏళ్లు. అయితే ఈ వయసులో కూడా ఆ పక్షి ఒక గుడ్డు పెట్టి రికార్డు సృష్టించిందని అమెరికా వన్యజంతు అధికారులు తెలిపారు.
లేసాన్ ఆల్బట్రాస్ అనే పక్షి జాతికి చెందిన విస్డంని తొలిసారి అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు 1956లో గుర్తించారు. ఆ సమయంలోనే దీని వయసు 5-6 సంవత్సరాలు. అప్పటి నుంచి ఈ ఆడపక్షి అమెరికాలోని హవాయి ద్వీపాల్లోని మిడ్వే అటోల్ నేషనల్ వైల్డ్ లైఫ్ లో నివసిస్తోంది. అయితే దీన్ని ఎవరూ బంధించలేదు. ఇది ఎక్కువగా సముద్ర ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. పెద్ద రెక్కలు ఉండే ఈ సముద్ర పక్షి సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. ఇటీవలే విస్డమ్ తన జీవితకాలంలో 60వ సారి గుడ్డు పెట్టిందని పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ అధికారికంగా ఫేస్ బుక్ ద్వారా తెలిపింది.
విస్డమ్ ప్రత్యేకత ఏంటి?
విస్డమ్ మరో మగ పక్షి అకేకామైతో కలిసి పసిఫిక్ సముద్ర ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. 2006 నుంచి వీరిద్దరూ గుడ్లు పెట్టేవారు. లేసాన్ ఆల్బట్రాస్ పక్షులు సాధారణంగా ఒకే పక్షితో సావాసం చేస్తారు.. ఫలితంగా ఏడాదికా ఒకసారి గుడ్డు పెడతారు. అయితే ఆడపక్షి గుడ్డు పెట్టిన తరువాత సుముద్ర విహారానికి వెళ్లిపోతుంది. కానీ ఆ తరువాతే మగపక్షి బాధ్యతలు మోస్తుంది.
లేసాన్ ఆల్బట్రాస్ మగపక్షుటు దాదాపు 66-65 రోజుల పాటు గుడ్డుని పొదగడానికి దానిపై కూర్చొని ఉండిపోతాయి. ఆ తరువాత పిల్లలు గుడ్డు నుంచి బయటికి వచ్చాక జంట పక్షులు వాటిని పోషించడానికి దశల వారీగా ఆహారం తీసుకొని వస్తాయి. పిల్లలు పెద్దవి కాగానే వాటిని తీసుకొని సముద్రానికి వెళ్లి అక్కడ చిన్న చేపలు, ఇతర చిన్న సముద్ర జీవులను వేటాడడం నేర్పిస్తాయి.
Also Read: అతనికి 100.. ఆమెకు 102.. లేటు వయసులో లవ్ మ్యారేజ్.. గిన్నిస్ రికార్డ్
అయితే అలా ఒకసారి సముద్రానికి వెళ్లిన అకేకమాయి మగపక్షి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో చాలా సంవత్సరాలు విస్డం ఒంటరిగానే ఉండేది. ఏదీ సరిగా తినేది కాదు. దీంతో జూ అధికారులే దానికి భోజనం పెట్టేవారు. అయితే కొన్ని నెలల క్రితం విస్డం మరో మగపక్షితో సావాసం చేసింది. ఫలితంగా నవంబర్ నెలలో ఒక గుడ్డు పెట్టింది. 74 ఏళ్ల లేటు వయసులో విస్డం గుడ్డు పెట్టడం చాలా విచిత్రమని జంతు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
“విస్టం పెట్టిన గుడ్డు నుంచి తప్పకుండా ఒక ఆరోగ్యవంతమైన పిల్ల పక్షి బయటికి వస్తుందని నాకు నమ్మకం ఉంది.” అని మిడ్వే నేషనల్ వైల్డ్ లైఫ్ రెఫ్యూజ్ వన్యజంతు బయోలిజిస్ట్ సూపర్ వైజర్ జొనాథన్ ప్లిస్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విస్డం పెట్టిన గుడ్ల నుంచి ఇప్పటివరకు 30 పిల్లలు వచ్చాయిన ఆయన తెలిపారు.
ప్రతి సంవత్సరం మిడ్వే నేషనల్ వైల్డ్ లైఫ్ జూకి లక్షలాది సముద్ర పక్షులు వలస వస్తూ ఉంటాయని.. ఆ ప్రదేశం సురక్షితంగా భావించి అక్కడ గుడ్లు పెడతాయని జొనాథన అన్నారు. సాధారంణంగా లేసాన్ ఆల్బట్రాస్ పక్షి జీవితకాలం 68 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కానీ విస్డం మాత్రం 74 ఏళ్లు అయినా ఇంకా ఆరోగ్యంగానే ఉంది.
విస్డం పక్షి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు, పోస్ట్ లు తెగ వైరల్ అవుతున్నాయి.