Manchu Family : మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకు ముదురుతుంది.. నిర్మాత, నటుడు మోహన్ ఇంట్లో ఆస్తి వివాదాలు తెర మీదికి వచ్చాయి. విభేదాలు భగ్గుమన్నాయి. పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకూ వెళ్లాయి.. ఇక మనోజ్ పై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు మోహన్ బాబు కూడా తన కొడుకులు కోడలికి ఆస్తిలో చిల్లి గవ్వను కూడా ఇవ్వను అనేసి తెగేసి చెప్పడమే కాదు.. పోలీసులకు ఫిర్యాదు చేసాడు.. మనోజ్ వల్ల తనతో పాటు భార్య ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 8 వ తేదీన తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు అలజడి సృష్టించారని, భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు.. ఇక నిన్న రాత్రి జరిగిన గొడవ తారాస్థాయికి చేరింది. పోలీసులు కూడా వీరిద్దరికీ నోటీసులు పంపించారు.
ఇక సోమవారం తెల్లవారు జామున కూడా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హల్‌చల్ చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు వివరించారు. ఉదయం సమయంలో మరోసారి మనోజ్ అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లోకి జొరబడ్డారని, తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు పోలీసులను మోహన్ బాబు ఇంటి వద్ద భారీగా చేరుకున్నారు.. ఆస్తి కోసమో, డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదని, ఇది ఆత్మగౌరవానికి, భార్య పిల్లల భద్రతకు సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు.. అటు మనోజ్ ఒక మగాడిగా వచ్చి నేరుగా తన వద్దకు వచ్చి, తనను ఏం చేసినా ఫర్వాలేదని, భార్య మీదికి వెళ్లడం సరికాదని మనోజ్ అన్నారు. తనను తొక్కేయడానికి భార్య, పిల్లలను తీసుకొస్తున్నారని విమర్శించారు. భార్య, పిల్లలు ఇంట్లో ఉండగా అలా అసభ్యకరంగా మాట్లాడటం సరికాదని మనోజ్ మీడియా ముందు సవాల్ విసిరాడు.
ఇక పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం తో మనోజ్ సెక్యూరిటీ కోసం పోలీసులు ఆయనకు కూడా కానిస్టేబుళ్లు ఇంటికి వచ్చి తన మనుషులు, బౌన్సర్ల ను భయపెట్టారని, వేరే బాడీ గార్డులను ఇంట్లోకి పంపించారని మంచు మనోజ్ అన్నారు. పోలీసులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తోన్నారని ఆయన నిలదీశారు. తనకు వ్యక్తిగతంగా భద్రత కల్పిస్తోన్న మనుషులను వెనక్కి పంపించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.. కానీ పోలీసుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని మౌనిక పోలీసుల పై కంప్లైంట్ చేస్తానని చెప్పిన విజువల్స్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ గొడవలతో విసిగిపోయిన పోలీసులు మంచు ఫ్యామిలీ తీరు పై సీరియస్ అయ్యినట్లు తెలుస్తుంది.. మనోజ్, విష్ణు కి రాచకొండ సీపీ సీరియస్ అయ్యారు. ఇద్దరికీ రేపు ఉదయం హాజరు కావాలని నోటీసులు పంపారు. ఇప్పటికే మోహన్ బాబు, మంచు మనోజ్ లైసెన్స్ గన్ లను సీజ్ చేశారు పోలీసులు.. మంచు ఫ్యామిలీ గొడవలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. పోలీసుల విచారణ అనంతరం ఈ గొడవలు సర్దు మనుగుతాయేమో చూడాలి..