Hyderabad Crime News: ఓ డాక్టర్ చెప్పిన మాటలను యంగ్ డాక్టర్ నమ్మింది. ప్రేమ అంటూ ఆమె వెంట తిరిగాడు.. నమ్మించాడు. నిజమేనని నమ్మేసింది. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఏకాంతానికి ప్రయత్నం చేయబోయాడు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డాడు. దీంతో బెంబేలెత్తిపోయింది ఆ యంగ్ డాక్టర్. అతడి గురించి కూపీ లాగింది. ఆ డాక్టర్ మాయగాడని తెలుసుకుని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు డిటేల్స్‌లోకి వెళ్తే..
మహబూబాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చైల్డ్ డాక్టర్‌గా పని చేస్తున్నాడు జర్పుల స్వామి. ఆయన వయస్సు 37 ఏళ్లు. సరిగ్గా రెండేళ్ల కిందట ఆ ఆసుపత్రిలో మెడికోగా పని చేస్తున్న యువ వైద్యురాలుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్‌కు దారి తీసింది. చివరకు ప్రేమగా మార్చాడు ఆయన.
తన భార్య బలవంతంగా తనను వివాహం చేసుకుందని ఆమెని నమ్మించే ప్రయత్నం చేశాడు. తన భార్యకు నాలుగు అబార్షన్లు అయ్యాయని, ఆమెకి విడాకులు ఇచ్చినట్టు చెప్పాడు. ఇలాంటి మాయమాటలతో యువ వైద్యురాలిని నమ్మించాడు. నిజమేనని నమ్మింది కూడా. ఈ ప్రేమ కాస్తా పెళ్ళి వైపు అడుగులు పడుతున్నాయి. అందుకు సమయం ఆసన్నమైంది.
సీన్ కట్ చేస్తే.. గతేడాది సెప్టెంబరులో యువ వైద్యురాలు హైదరాబాద్ సిటీలోని ఓ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తోంది. డాక్టర్ స్వామి జనవరి 12న నేషనల్ పెడికాన్ సదస్సు కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ సదస్సుకు యువ వైద్యురాలు హాజరైంది. ఇద్దరు కలిసి బంజారాహిల్స్‌లోని ఫేమస్ హోటల్‌లో గది తీసుకున్నారు.
ALSO READ: ఆటో డ్రైవర్ హంతకుడు.. అతని ఆటోలో ఎక్కితే మృత్యులోకానికే
పెళ్లి పేరుతో ఆమెపై బలవంతంగా ఏకాంతానికి ప్రయత్నం చేశాడు. అందుకు యువ వైద్యురాలు అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి తెలియవద్దని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి వెళ్లిపోయాడు. డాక్టర్ స్వామి వ్యవహారంపై ఆరా తీసింది యువ వైద్యురాలు.
తనకు తెలిసిన వారితో ఆరా తీసింది. చివరకు అసలు గుట్టు బయటపడింది. డాక్టర్ స్వామి.. తన భార్యకు విడాకులు ఇవ్వలేదని తేలింది. ఆ విషయం తెలియగానే షాకైంది. తనకు జరిగిన అన్యాయాన్ని స్వామి పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. వారి నుంచి స్పందన రాలేదు.
రెండు రోజుల కిందట బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది యువ వైద్యురాలు. చివరకు మంగళవారం డాక్టర్ స్వామి, ఆయన కుటుంబ సభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ స్వామి.. ఆమెపై ఇంకెన్ని ఆరోపణలు చేస్తాడో చూడాలి.