Rickshaw Driver Killer| అడవి మృగాలకు దూరంగా మనిషి ఒక సమాజాన్ని నిర్మించుకొని జీవిస్తున్నాడు. కానీ సమాజంలో కూడా మానవ రూపంలో కొన్ని మృగాలు తిరుగుతూ ఉన్నాయి. అందుకే అపరిచితులతో జాగ్రత్త వహించాలి లేకపోతే ఊహించిన ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇటీవల ఒక 55 ఏళ్ల వ్యక్తి అనుకోకుండా అదృశ్యమయ్యాడు. ఆ తరువాత అతని మృతదేహం రెండు బ్యాగుల్లో ముక్కులుగా లభించింది. ఈ షాకింగ్ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరం అల్తాన్ ప్రాంతానికి చెందిన చంద్రవాన్ దూబే అనే 55 ఏళ్ల వ్యక్తి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్నాడు. ఆయన మే 13 నుంచి కనబడకుండా పోయాడు. రెండు రోజులు పాటు వెతికిన అతని కుటుంబం చివరికి నిరాశకు గురై పోలీసులకు మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు.
అయితే మూడో రోజు అతని కుటుంబానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. చంద్రవాన్ ని కిడ్నాప్ కు గురయ్యాడని.. వెంటనే రూ.3 కోట్లు చెల్లించకపోతే చంపేస్తామని కిడ్నాపన్ చంద్రవాన్ ఫోన్ నుంచే కాల్ చేశాడు. ఈ సమాచారం పోలీసులకు అందడంతో పోలీసులు సీరియస్ గా విచారణ చేపట్టారు. సీసిటీవి వీడియోలు గాలించగా.. చంద్రవాన్ చివరి సారిగా ఒక ఆటో ఎక్కినట్లు కనిపించింది. ఆ ఆటో నెండర్ ఆధారంగా ఆటో డ్రైవర్ ని పిలిచి విచారణ చేయగా.. అతని పేరు రషీద్ అని తెలిసింది. ఆ ఆటో డ్రైవర్ తనకేమీ తెలియదని.. రోజూ ఎంతో మంది తన ఆటో ఎక్కుతుంటరాని.. తనకేమీ గుర్తు లేదని చెప్పాడు.
పోలీసులకు రషీద్ మాటలపై అనుమానం కలిగింది. అందుకే అతను నివసించే ప్రాంతంలోని సిసిటీవీ వీడియోలను పరిశీలించారు. ఆ వీడియోల్లో చంద్రవాన్ ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. కానీ తిరిగి అక్కడి నుంచి బయలుదేరినట్లు కనిపించలేదు. అయితే మరుసటి రోజు రషీద్ రెండు పెద్ద పెద్ద బ్యాగులు తీసుకొని ఒక స్కూటీపై వెళుతున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలు చూసి పోలీసులకు రషీద్ ఆ తరువాత ఏ ప్రాంతానికి వెళ్లాడో వరుసగా సిసిటీవి వీడియోలను ఫాలో అయ్యారు.
Also Read: నకిలీ పెళ్లికొడుకు వేషంలో పోలీస్.. ఆ యువతిని ఏం చేశాడంటే
రషీద్ నేరుగా ఊరి చివర ఉన్న లింబాయత్ ప్రాంతానికి వెళ్లి తిరిగి వచ్చేశాడు. పోలీసులు అనుమానంతో లింబాయత్ ప్రాంతానికి వెళ్లి అక్కడ గాలించగా.. ఆ రెండు బ్యాగులు కనిపించాయి. ఆ బ్యాగుల్లో చంద్రవాన్ శరీరం ముక్కలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రషీద్ ఈ విషయం పసిగట్టేశాడు. అందుకే పోలీసులు తనకోసం వస్తారిన అనుమానించి పరారయ్యాడు.
పోలీసులు చంద్రవాన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించి.. నిందితుడు అయిన ఆటో డ్రైవర్ రషీద్ కోసం గాలిస్తున్నారు. రషీద్ గురించి ఆరా తీయగా.. అతను ఇతర రాష్ట్రాల్లో కూడా హత్యల కేసుల్లో వాంటెడ్ అని తేలింది. అక్కడ కూడా తన ఆటోలో ఎక్కే ప్రయాణికులను హత్యలు చేసి దోపిడీలు చేశారనే ఆరోపణలున్నాయి.