Samarlakota Family Incident: కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో దారుణం జరిగింది. ఇంటిలో ఉన్న ఒక తల్లి, ఇద్దరు పిల్లల్ని బలమైన ఆయుధంతో తల పగులకొట్టి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. సీతరామ కాలనీకి చెందిన మలపత్తి మాధురి(26)కి జెస్సీలో(8), పుష్ప కుమారి(6) ఇద్దరు కుమార్తెలు.. వీరంతా ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బలమైన ఆయుధంతో కొట్టి చంపారు. వారి సెల్‌ఫోన్లు కూడా తీసుకెళ్లారు.
తల్లి, ఇద్దరు పిల్లల్ని తల పగులకొట్టి హత్య
సీతారామ కాలనీకి చెందిన ధను ప్రసాద్.. ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కంపెనీలో డ్రైవరుగా పని చేస్తున్నాడు. నైట్ డ్యూటీ నుంచి తిరిగొచ్చే లోపు అతని భార్యని, ఇద్దరు పిల్లల్ని దారుణంగా హత్య చేశారు. కుటుంబంలోని ముగ్గురు విగతజీవులుగా పడి ఉండటంతో కన్నీరు మున్నీరయ్యాడు ధను ప్రసాద్. ఇంటి ముందు తలుపులకు తాళాలు వేసి ఉండగా.. వెనుక నుంచి వచ్చారని చెబుతున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం.. ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ధర్మస్థల కేసులో కొత్త మలుపు.. తెరపైకి మరో వ్యక్తి
భయందోళనలో గ్రామ ప్రజలు..
అయితే ఈ కేసులో నిందితులు ఎవరన్నది పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఎందుకు వీరిని చంపారు.. అసలు భర్తే విరిని చంపించాడా.. లేదా ఎవరికైనా వారిపై పగతో కుట్ర పన్ని ఇలా చేశారా అనే కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. అయితే ఈ ఘటన తెలుసుకున్న గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో అని భయందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.