Big Breaking In Dharmasthala: దేశంలోనే సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ధర్మస్థలలో తాను వందకు పైగా యువతులు, మహిళల మృతదేహాలను ఖననం చేశానని చెప్పిన పారిశుద్ధ్య కార్మికుడు.. అతను చూపించిన తొమ్మిది, పదో పాయింట్లలో నిన్న సాయంత్రం వరకు తవ్వకాలు జరిపారు. తొమ్మిదో పాయింట్లో తాను ఏడు మృతదేహాలను పూడ్చానని చెప్పాడు పారిశుద్ధ్య కార్మికుడు. సంఘటనా ప్రాంతానికి కూలీలను, ఆ ప్రతక్ష్య సాక్షిని తీసుకెళ్లారు సిట్ అధికారులు. తవ్వకాలు జరిపినా.. ఏమి కనిపించకపోవడంతో మినీ బుల్డోజర్‌తో సహా పనులు చేయించారు. అక్కడా అనుమానిత అవశేషాలు దొరకలేదు.
9, 10 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినా దొరకని ఆనవాళ్లు
వెంటనే పదో పాయింట్‌కి తీసుకెళ్లి తవ్వకాలు జరిపారు. అక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. 9, 10 పాయింట్లలో ఎముకలు, మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్లు.. ఏమి దొరక్కపోవడంతో పారిశుద్ధ్య కార్మికుడిపై ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. తవ్వకాలు జరిపేటప్పుడు ఎవరు రికార్డు చేయకుండా పరదాలను కూడా కట్టారు.
6వ పాయింట్లో మాత్రమే 25 ఎముకలు లభ్యం
ఇక్కడే పూడ్చానని చెప్పావు కాదా? మరి ఒక్కటి మృతదేహం, అనవాళ్లు కూడా కనిపించలేదని, పూడ్చి పెట్టిన ప్రదేశాలను ఏమైనా మర్చిపోయావా? అంటూ ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ఆరో పాయింట్‌లో మాత్రమే ఎముకలు లభించాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో.. ఏం చేయాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు
సిట్ అధికారి మంజునాథ గౌడ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణ
ఓ వైపు సిట్ తవ్వకాలు జరుపుతుండగా.. తనను సిట్ అధికారులు బెదిరించారని ఆరోపిస్తున్నాడు పారిశుద్ధ్య కార్మికుడు. వెనక్కి తీసుకోవాలంటూ బెదిరించారని అతని తరఫు న్యాయవాది ఆరోపించారు. సిట్ అధికారి మంజునాథ గౌడ ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. సిట్ నుంచి ఆయనను తప్పించాలని కోరారు. బెళ్తంగడిలోని సిట్ కార్యాలయానికి పిలిపించుకుని.. తప్పుడు ఫిర్యాదు చేశానని, ఎటువంటి మృతదేహాలూ ఖననం చేయలేదని చెప్పాలంటూ మంజునాథ గౌడ బెదిరించారన్నారు. దీనిపై కేసు పెడతామని న్యాయవాది చెప్పారు.
ఆరో ప్రదేశంలో దొరికన 25 ఎముకలను.. బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన అధికారులు
ధర్మస్థలలో ఆరో పాయింట్లో లభ్యం అయిన 25 ఎముకలను.. బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వాటిని చూసి, పరిశీలించి.. అవి పురుషులవా, మహిళలవా అని చెప్పడం సాధ్యం కాదని ప్రయోగశాల అధికారి డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు.
సిట్ అధికారులపై బెదిరింపుల ఆరోపణలు
అసలు ధర్మస్థలలో ఏమి జరిగింది? మృతదేహాలు నది ప్రవాహంలో ఏమైనా కొట్టుకుపోయాయా? సిట్ అధికారులు బెదిరించారన్న ఆరోపణలు ఎంతవరకు నిజం? 9, 10 ప్రదేశాల్లో ఒక్క ఎముక కూడా లభ్యం కాకపోవడం ఏంటి? పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కడినే ఎందుకు సిట్ విచారణ చేస్తోంది? ఇంత వ్యవహారంలో ఒక్క నిందితుడే ఎందుకు ఉన్నాడు? ఎందుకు మహిళలనే పారిశుద్ధ్య కార్మికుడు పూడ్చిపెట్టానని చెబుతున్నాడు. మిగిలిన మూడు ప్రదేశాల్లో ఏం దొరుకుతాయి? సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెరపైకి మరో వ్యక్తి
అయితే ఇప్పటి వరకూ ఎంత మంది అమ్మాయిలు మిస్సయ్యారని ఒక్క ఎఫైర్ కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఒక వ్యక్తి తన కుటుంబానికి చెందిన పద్మలత అనే మహిళ మిస్సయ్యిందంటూ.. కంప్లైంట్ చేసేందుకు ముందుకు వచ్చాడు. అతనని ధర్మస్థల స్థానికుడిగా చెబుతున్నారు. అయితే తన కుటుంబంలోని మహిళ కొన్నెళ్ళ క్రిందట మిస్సయ్యింది.. కానీ కంప్లైంట్ చేసేందుకు ధైర్యం చాలక ముందుకు రాలేదు.. కానీ, ఇప్పుడు జరుగుతున్న విచారణతో ముందుకు వచ్చాను అని తెలిపారు. నిన్న రాత్రి స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదుపై సిట్ అధికారులు స్పందిస్తామని హామి ఇచ్చారు.
Also Read: బాబోయ్..! మళ్లీ వర్షాలు దంచబోతున్నాయి.. ఎప్పటి నుంచి అంటే..
అలాగే ఇన్నాళ్ల నుంచి పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదని.. ఎవ్వరు అసలు ఎఫైఆర్ తీసుకునేవాళ్లు కాదు.. ఇక్కడ ఒక దౌర్జన్యం జరిగేది అని అక్కడి స్థానికుడు చెబుతున్నాడు. అంతేకాకుండా గ్రామస్తులందరికి కూడా ఈ విషయాలు తెలుసు అని చెప్పాడు. ఇప్పుడు ఒకరు ముందుకు వచ్చారు.. ఇంకా చాలా మంది ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.