OTT Movie : బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన మూవీస్ కొద్దిరోజుల తేడాతోనే ఓటీటీలో దర్శనమిస్తూన్నాయి. ఇక ఓటీటీలు కూడా సినిమా ఏ భాషకు చెందినది అయినా అన్నీ భాషల్లోనూ డబ్ చేసి మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే యాక్షన్, రొమాన్స్ వంటి ఎన్నో చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే మంచి స్టోరీతో నడిచే ఒక టర్కీ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో, పేరేమిటో తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
మనం తెలుగులో ఫీల్ గుడ్ కుటుంబ కథా చిత్రాలు చూస్తూ ఉంటాం. అటువంటి ఒక కుటుంబ కథా చిత్రం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ‘నోబడి హోమ్’ (Nobody Home) ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే..
కుటుంబ పెద్ద అయిన తండ్రిని పోగొట్టుకున్న ఒక కుటుంబం కథ ఇది. తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆ కుటుంబ బాధ్యత తల్లి మీద పడుతుంది. ఆమెకు నలుగురు పిల్లలు ఉంటారు. తల్లి వీరిని పట్టించుకోదు. డిప్రెషన్ లోకి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. పెద్ద కూతురు కుటుంబ బాధ్యతను తీసుకొని ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. తను పెళ్లి వయసు దాటి 32 సంవత్సరాలు వచ్చినా గాని కుటుంబంలో ఏ మార్పు రాకపోగా, ఇంకా దిగజారి పోతూ ఉంటుంది. ఇంతలో తన తమ్ముడు డ్రగ్స్ కి బానిస అవుతాడు.
తన స్కూల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి, అతని తల్లితో రిలేషన్ పెట్టుకుంటాడు. ఇతడు ఏ బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు తన తల్లికి అనారోగ్యంతో ఉండగా తన తమ్ముడికి ఫోన్ చేసి వెళ్ళమంటుంది. అతడు వెళ్లడు. అయితే తన కంపెనీలో పని చేసే కొలీగ్ కి ఆ విషయం చెప్పి అతని సహాయం తీసుకుంటుంది. అతని పేరు రహీం, అతడు ఈమెని లవ్ చేస్తూ ఉంటాడు. కానీ ఈమె కుటుంబ బాధ్యతల వల్ల అతనిని దూరంగా పెడుతుంది. కుటుంబంలో మార్పు రాకపోగా, కొంతకాలం చూసి తన జీవితం వృద్ధాప్యం వచ్చేంతవరకు ఇలానే ఉంటుందని గ్రహించి, తన దారి చూసుకోవాలని రహీంతో వివాహానికి ఒప్పుకుంటుంది. ఆమె పెళ్లి కుటుంబంలో ఎవరికి ఇష్టం ఉండదు. తర్వాత రహీంతో ఈమె పెళ్లి జరిగిందా? తన తమ్ముడు డ్రగ్స్ నుంచి కోలుకున్నాడా? తన ఫ్రెండ్ మదర్ తొ రిలేషన్ కొనసాగిందా? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘నోబడి హోమ్‘ (Nobody Home) అనే మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం.. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లను ఇష్టపడేవారు ఈ సినిమాపై ఓ లుక్కేసేయండి