BigTV English

Hyderabad Crime: ఎంత కష్టం వచ్చిందో.. కాళ్ల పారాణి ఆరనేలేదు.. వధువు ఆత్మహత్య!

Hyderabad Crime: ఎంత కష్టం వచ్చిందో.. కాళ్ల పారాణి ఆరనేలేదు.. వధువు ఆత్మహత్య!

Hyderabad Crime: కాళ్ల పారాణి ఆరనేలేదు. పెళ్లికి కట్టిన తోరణాలు ఎండనేలేదు. అంతలోనే ఆ నూతన వధువుకు ఏ కష్టమొచ్చిందో కానీ, ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.


హైదరాబాద్ కు చెందిన లావణ్యకు అనంతపురం కు చెందిన మోహన్ ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ పెళ్లికి దారితీసింది. హైదరాబాద్ లోని హనుమాన్ ఆలయంలో వీరి వివాహం నెల రోజుల క్రితం జరిగింది. నిండు నూరేళ్ల పాటు తమ బంధం కొనసాగాలని ఇద్దరు కళ్యాణం సమయంలో భగవంతుడిని కోరుకున్నారు. అయితే బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది.

లావణ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. చీర కొంగును మెడకు బిగించుకొని లావణ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వివాహమై నెలరోజులు కూడా గడవకముందే నూతన వధువు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు.


పోలీసులు విచారణలో భాగంగా స్థానికుల ద్వారా పలు వివరాలు తెలుసుకున్నారు. అయితే లావణ్య ఆత్మహత్యకు పరపడానికి గల కారణంగా కుటుంబ సమస్యలే ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వారు వైద్యశాలకు తరలించారు.

Also Read: CM Revanth Reddy: పనితీరు మెరుగుపరుచుకోండి.. మంత్రులకు, ఎమ్మేల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన

ప్రేమ పెళ్లి చేసుకున్న లావణ్య ఆత్మహత్యకు పాల్పడడం వెనక గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కాళ్ల పారాణి ఆరకముందే, నూతన వధువు ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికులు విచారం వ్యక్తం చేశారు. లావణ్య భర్త ను పోలీసులు అసలు విషయం తెలుసుకునేందుకు విచారిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వివాహమై నెల తిరగకముందే, వధువు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనగా మారింది. ఈ ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో పూర్తిస్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది

Related News

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Anantapur: తీవ్ర విషాదం.. వేడి వేడి పాలల్లో పడి చిన్నారి మృతి..

West Godavari Crime: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య, సోదరుడికి మెసేజ్, పాలకొల్లులో దారుణం

Fire Accident: ఏపీ, తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు

UP Crime News: మైనర్ ప్రియురాలిని కాల్చిన ప్రియుడు, ఆ తర్వాత ఏం జరిగింది? యూపీలో దారుణం

Srikakulam Crime: లారీతో ఢీకొట్టి దారుణంగా ఇద్దరిని చంపేశాడు.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Guntur Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే డాక్టర్ ఫ్యామిలీ..

Big Stories

×