BigTV English

AL-Qaida Terrorists Arrest: ఢిల్లీలో ఆపరేషన్ ఆల్ ఖైదా..11 మంది అరెస్ట్

AL-Qaida Terrorists Arrest:  ఢిల్లీలో ఆపరేషన్ ఆల్ ఖైదా..11 మంది అరెస్ట్

Delhi Police uncovers AL-Qaida Terror network 14 arrested from three states: బంగ్లాదేశ్ అల్లర్ల దృష్ట్యా భారత్ లో ఉగ్రవాద కదలికలపై సైన్యం నిఘా పెట్టింది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందనే అనుమానంతో భారీ ఎత్తున ఉగ్రవాదుల కదలికలపై గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదాకు చెందిన ఓ గ్రూప్ కు సంబంధించిన 14 మంది కీలక టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ కి చెందిన పోలీసు వర్గం తెలిపాయి.


గత కొంతకాలంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆ ప్రాంతంలో జోరుగా సాగుతున్న నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ క్రమంలో యూపీ, రాజస్థాన్, జార్ఖండ్ పోలీసుల సహకారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. భారత్ లో నిషేధానికి గురైన ఉగ్రవాద సంస్థకు చెందిన గ్రూపు నాయకులు అరెస్టయినవారిలో ఉన్నారు.

అత్యాధునిక ఆయుధాలు లభ్యం


జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచికి చెందిన డాక్టర్ ఇస్తయాఖ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన గ్రూప్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. భారత్ లో పలు ప్రాంతాలలో తమ కార్యకలాపాలను విస్తరించి అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరు అత్యాధునిక ఆయుధాలను సైతం కలిగివున్నారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. వీరిలో రాజస్థాన్ ప్రాంతం నుంచి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా.. జార్ఖండ్, యూపీ నుంచి మరో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

అరెస్టైన ఉగ్రవాదుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వారిని ప్రశ్నిస్తున్నామని.. ఆధునిక ఆయుధాలు వీరికి ఎవరు సరఫరా చేస్తున్నారు? వీరికి మందుగుండు సామాగ్రి ఎక్కడినుండి వస్తోంది. వీరి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని పోలీసులు వారి స్టయిల్ లో ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తేలనున్నాయి.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×