గత కొంత కాలంగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం దిగ్గజం BSNL ప్రైవేట్ టెలికాం కంపెనీలకు దీటుగా రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇతర కంపెనీలకు సాధ్యం కాని రీతిలో తక్కువ ధరలకు క్రేజీ ఆఫర్లను అందిస్తుంది. అందులో భాగంగానే పండుగ నేపథ్యంలో మరో క్రేజీ నిర్ణయం తీసుకుంది. తన మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ఎంపికలపై తాత్కాలిక డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వలన వినియోగదారులు ఎక్కువ ధరలు కలిగిన రీఛార్జ్ ప్లాన్లను డిస్కౌంట్ తో తక్కువ ధరకే అందించే అవకాశం ఉంటుంది.
పండుగ సీజన్ లో భాగంగా డిస్కౌంట్ ఆఫర్ ను అక్టోబర్ 15 వరకు అందిచబోతోంది. ఈ ఆఫర్ రూ.199, రూ.485, రూ.1,999 ప్లాన్లకు వర్తిస్తుందని BSNL వెల్లడించింది. ఈ రీఛార్జ్ ప్లాన్లపై సబ్ స్క్రైబర్లు రూ.3.8 నుంచి రూ.38 వరకు డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. డిస్కౌంట్ తర్వాత రూ.195, రూ.475, రూ.1,961గా ధరలు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా BSNL తన ప్రకటను వెల్లడించింది. ‘ప్రతి రీఛార్జ్ పై డబ్బు ఆదా చేయండి’ అంటూ ఈ ఆఫర్ పోస్టర్ ను షేర్ చేసింది.
Read Also: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!
⦿ రూ.199 ప్లాన్
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 2GB డేటా లభిస్తుంది. అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS లను పొందే అవకాశం ఉంటుంది.
⦿ రూ.485 ప్లాన్
ఈ రీఛార్జ్ ప్లాన్ తో 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలను పొందే అవకాశం ఉంటుంది.
⦿ రూ.1,999 ప్లాన్
ఈ ప్లాన్ తో 365 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ లో మొత్తం 600 GB డేటా లభిస్తుంది. దీనిని ఏడాది పాటు వాడుకోవచ్చు. ఒకవేళ అయిపోతే, డేటా ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తక్కువ వ్యవధి ప్యాక్ లపై డిస్కౌంట్ తక్కువగా ఉన్నప్పటికీ, ఏడాది పాటు BSNL అందించే రీఛార్జ్ చేసుకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. వెంటనే రీఛార్జ్ చేసుకుని తగ్గింపును పొందాలని వినియోగదారులకు BSNL సూచించింది.
Read Also: ఫ్లిప్ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!