Medak District: ఇటీవల దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కామాంధులు కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. కామాంధుల రాజ్యంలో మహిళలు, యువతులు భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దేశంలో పలు చోట్ల కామాంధులు రెచ్చిపోతున్నారు. తాగిన మైకంలో ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అసలు మనుషులకు, జంతువులకు తేడా లేకుండా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. వయోభేదం అని తేడా లేకుండా ఓ వైపు అత్యాచార ఘటనలు జరుగుతుంటే.. మూగ జంతువులపై కూడా నీచులు కామాంధులగా మారి విరుచుకుపడుతున్నారు. మానవత్వానికి అవమానం జరిగేలా.. మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు కొందరు నికృష్టులు. తాజాగా ఓ కామాంధుడు గేదెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు చితక బాది పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్ జిల్లాలని చిన్నశంకరం పేట మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బిహార్ కు చెందిన రోహిత్ అనే యువకుడు మండలంలోని మిర్జాపల్లి గ్రామంలో గేదెల షెడ్డులో పని చేస్తున్నాడు. అయితే రోహిత్ కు ఏమనిపించిందో తెలియదు కానీ మృగాల కంటే హీనంగా ప్రవర్తించాడు. సోమవారం రాత్రి షెడ్డులోని ఓ గేదెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ నీచుడు. ఈ ఘటనను సీసీ కెమెరాల్లో చూసిన గేదెల షెడ్డు ఓనర్ రోహిత్ పట్టుకుని చితకబాదాడు. యజమాని సిద్ధిరాములుతో పాటు స్థానిక ప్రజలు కామాంధుడు రోహిత్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ALSO READ: DSSSB: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. కాంపిటేషన్ తక్కువ, దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే..!
ఈ సంఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశారు.. ‘ఇలాంటి పాశవిక చర్యలకు క్షమించేది లేదు.. మృగాల కన్నా దారుణంగా ప్రవర్తించిన ఈ దుర్మార్గుడికి కఠినమైన శిక్ష వేయాలి. మూగ జంతువుపై అత్యాచారం ఎలా చేయాలనిపించిందిరా నీచుడా’ అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘జంతువులను కూడా వదలి పెట్టని నికృష్ణులను జనంలోకి వదిలిపెడితే చాలా కష్టం.. జీవితాంతం జైల్లోనే ఉంచాలి’ అని కామెంట్ చేసుకొచ్చాడు.