Kantara Chapter1: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోనీ నేపథ్యంలో ఆయన సినిమాల పట్ల కూడా అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే ఇతర భాష హీరోలకు ఉన్న క్రేజ్ కూడా తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు లేదని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు . తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా (OG Movie)ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
నేడు సాయంత్రం నుంచి ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇక అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఓజీ ట్రైలర్ మంచి అంచనాలనే పెంచేసింది. అయితే ఓజీ సినిమాకు పోటీగా కన్నడ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) హీరోగా నటించిన కాంతారా చాప్టర్ 1(Kantara Chapter 1) సినిమా నుంచి కూడా ట్రైలర్ విడుదల చేశారు. ఒక ఈ ట్రైలర్ వీడియోకి కూడా ఎంతో మంచి ఆదరణ లభించింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా తెలుగులో ఓజీ సినిమా ట్రైలర్ తో పోలిస్తే కాంతార సినిమా ట్రైలర్ కు భారీ స్థాయిలో వ్యూస్ రావడంతో ఒకసారిగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న కాంతార చాప్టర్ 1
ఓజీ సినిమా ట్రైలర్ ఇప్పటివరకు 9 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోగా, కాంతార ట్రైలర్ మాత్రం 14 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఒక్క సారిగా తెలుగు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రిషబ్ శెట్టికి ఉన్నంత క్రేజ్ కూడా పవన్ కళ్యాణ్ కు లేదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంతార చాప్టర్ 1 సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
రిషబ్ నటనకు నేషనల్ అవార్డు..
కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా కొనసాగుతున్న రిషబ్ నటుడిగా కాంతార సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఒక ప్రాంతీయ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడంతో పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది. ఇక ఈ సినిమాలో రిషబ్ నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డు కూడా వరించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో ఈ సినిమాకు ఫ్రీక్వెల్ సినిమాగా కాంతార చాప్టర్ 1 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాని హోంభలే నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో రిషబ్ కు జోడిగా రుక్మిణి వసంత్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు.
Also Read: Pawan Kalyan: రజినీ తరువాత పవన్ కే ఆ ఘనత.. అది ఆయన రేంజ్