Tv Actress: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు పెళ్లయిన కొద్ది రోజులకి విడాకులు తీసుకుని విడిపోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతోమంది విడాకులు తీసుకొని ఒంటరి జీవితాలు గడుపుతున్నారు. ఒకప్పుడు ఈ కల్చర్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండేది కానీ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు శర్వానంద్ భార్య రక్షిత రెడ్డితో విడిగా ఉంటున్నారని , వీరిద్దరూ విడాకులు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా వీరి విడాకుల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరో బుల్లితెర జంట కూడా విడాకులు తీసుకొని విడిపోయారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
వదినమ్మ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నటి ప్రియాంక నాయుడు(Priyanka Naidu) మరొక బుల్లితెర నటుడు మధు బాబు(Madhu Babu)ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం 2021 వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ(Baby Girl) కూడా జన్మించిన సంగతి తెలిసిందే . ప్రియాంక నాయుడు నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఫోటోలు మొత్తం డిలీట్..
ఇక తన కుమార్తెకు సంబంధించిన ఫోటోలను కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు. అయితే ఇటీవల తన కూతురు రెండో పుట్టినరోజు వేడుకలను మధుబాబు లేకుండా ప్రియాంక మాత్రమే జరిపించారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రియాంక మధు బాబుతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేశారు. ఇలా ఫోటోలన్నింటినీ కూడా డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు కారణంగానే విడాకులు తీసుకుని విడిపోయారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటివరకు వీరి విడాకుల గురించి వస్తున్న వార్తల పట్ల మధుబాబు లేదా ప్రియాంక నాయుడు ఎక్కడ స్పందించలేదు. ఇలా వీరి విడాకులు వార్తలు బయటకు రావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
వదినమ్మ సీరియల్ తో గుర్తింపు..
మరి నిజంగానే మధుబాబు, ప్రియాంక విడాకులు తీసుకుని విడిపోయారా? మరి వీరి విడాకులకు గల కారణాలు ఏంటి ?అనేది తెలియాలి అంటే ఈ జంట స్పందించాల్సి ఉంటుంది. అయితే వీరికి కుమార్తె జన్మించిన తర్వాత విడాకులు తీసుకుని విడిపోవడం గమనార్హం .ప్రియాంక నాయుడు వదినమ్మ సీరియల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక మధుబాబు మంగమ్మగారి మనవడు అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి అనంతరం అక్కా చెల్లెళ్ళు, అభిషేకం వంటి సీరియల్స్ లో నటించారు.
Also Read: Kantara Chapter1: ఓజీను తొక్కేసిన కాంతార… రిషబ్ కు ఉన్న క్రేజ్ పవన్ కు లేదా ?