E-Paper
Advertisement

Army Vehicle Accident: అదుపుతప్పి లోయలో పడ్డ ఆర్మీ వెహికిల్ .. 10మంది మృతి.. పలువురికి గాయాలు

Army Vehicle Accident: అదుపుతప్పి లోయలో పడ్డ ఆర్మీ వెహికిల్ .. 10మంది మృతి.. పలువురికి గాయాలు
Advertisement

Army Vehicle Accident: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆ వాహనంలో మెుత్తం 17 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

భదేర్వా- పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సిబ్బందిని తరలిస్తున్న క్రమంలో మలుపు వద్ద వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. స్థానికులు, ఆర్మీ సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషాద కరమైన ఘటనపై సైనిక ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ALSO READ: కుట్రలను తిప్పికొడదాం.. పార్టీ ప్రతిష్ఠను కాపాడదాం.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×