Viral News : పెళ్లికూతురు బంగారు బొమ్మలా ఉంది. చూడచక్కని అమ్మాయి. కళ్లు మూసుకుని పెళ్లికి ఒప్పేసుకున్నాడు అతను. ధూంధాంగా జరిగింది వాళ్లిద్దరి వివాహం. తనకు అందమైన భార్య వచ్చిందంటూ తెగ మురిసిపోయాడు. వాడు భలే లక్కీ ఫెలోరా అంటూ ఫ్రెండ్స్ కుళ్లుకున్నారు. ఊర్లో అంతా ఆ అమ్మాయి అందం గురించే చర్చ. ఆ విషయాలు తెలిసి మనోడు మరింత మురిసిపోయాడు. అందమైన భార్య.. అందమైన జీవితం.. అంటూ స్వీట్ డ్రీమ్స్‌లోకి జారుకున్నాడు. అలా అలా ఓ 10 రోజులు గాల్లో తేలిపోయాడు. భార్యను చూస్తూనే కాలం గడిపేశాడు. ఎంతసేపని ఇంట్లోనే ఉందాం.. షాపింగ్‌కు వెళ్లి అలా బయట తిరుగొద్దాం అంటూ ఆ కొత్త పెళ్లికూతురు భర్తను కోరింది. నువ్వు అడిగితే ప్రాణమే ఇచ్చేస్తా బంగారం.. షాపింగ్‌కు తీసుకెళ్లనా అంటూ ఎగిరి గంతేశాడు. చల్ చలోరే చలో అంటూ టిప్‌టాప్‌గా రెడీ అయి బజారుకెళ్లింది ఆ కొత్త జంట. కట్ చేస్తే.. కాసేపటికే భార్య మిస్సింగ్.
భార్య మిస్సింగ్.. పోలీసుల ఎంట్రీతో..
అప్పటి వరకూ తనతోనే ఉండే. అంతలోనే కనిపించకుండా పాయే. భార్య ఎటుపోయింది? ఆ భర్త తెగ టెన్షన్ పడ్డాడు. తప్పిపోయిందని వెతకడం స్టార్ట్ చేశాడు. ఎంత సేపు వెతికినా.. ఎన్ని గల్లీలు తిరిగినా భార్య జాడ దొరకలే. ఎవరైనా ఎత్తుకెళ్లారా? ఇంకేదైనా అయిందా? తెగ భయపడ్డాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. 10 రోజుల క్రితమే పెళ్లి అయింది.. అంతలోనే భార్య కనిపించకుండా పోయింది.. అంటే..? పోలీసులు మొదట ఆ భర్తనే అనుమానించారు. అతనే భార్యను ఏదైనా చేసేసి డ్రామాలు అడుతున్నారని డౌట్ పడ్డారు. గట్టిగా ప్రశ్నించాక అతను కాదులే అనుకున్నారు. మరి, ఆ అమ్మాయి ఏమైనట్టు? ఎటు వెళ్లినట్టు? యూపీలోని చందౌలికి చెందిన ఖుషీ, షంషేర్‌ల ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది.
పాపం.. భయపడిపోయిన భర్త..
పోలీస్ స్టైల్ విచారణలో ఆ నవ వధువు ఆచూకీ తెలిసింది. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి ఆమె ఎక్కడ ఉందో గుర్తించారు. వారణాసిలో ఆమె ఉన్నట్టు తేల్చారు. అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఆమెకు పెళ్లికి ముందే ఓ లవర్ ఉన్నాడు. పెళ్లైన 10 రోజులకే అతనితో లేచిపోయింది. ఇదీ మేటర్. ఇప్పుడేం చేయాలి? పోలీసులు ఆ అమ్మాయిని ఒపీనియన్ అడిగితే తాను తన ప్రియుడితోనే ఉంటానని.. భర్తలో కాపురం చేయనని తేల్చి చెప్పింది. ఇక, భర్త వంతు వచ్చింది. పోలీసులు అతన్ని స్టేషన్‌కు పిలిపించి.. జరిగింది చెప్పారు. భార్యను తిరిగి కాపురానికి తీసుకెళ్లమని చెప్పారు. కానీ, అందుకు ఆ పెళ్లికొడుకు వద్దంటే వద్దంటూ నిరాకరించాడు. ఎందుకు తీసుకెళ్లవని పోలీసులు అడిగితే షాకింగ్ డైలాగ్ చెప్పాడతను. తాను డ్రమ్‌లో ప్యాక్ చేసి చనిపోవాలని అనుకోవడం లేదని అన్నాడు. ఆ మాట విన్నాక ఖాకీలకు నోట మాట రాలేదు.
Also Read : ఏపీలో మంటపెట్టిన మల్లెపూలు.. ఆ పాస్టర్‌పై చర్యలకు డిమాండ్
ఈ భార్యలకు ఏమైంది?
ఇటీవల భర్తను చంపిన భార్యల ఉదంతాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇండోర్‌కు చెందిన జంట.. మేఘాలయకు హనీమూన్ వెళ్లడం.. అక్కడ భర్తను ప్రియుడితో చంపించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అంతకుముందు ఓ భార్య అలానే తన లవర్‌తో కలిసి.. నేవీలో పని చేసే తన భర్తను చంపేసి, ముక్కలుగా నరికేసి.. బాడీ పార్ట్స్‌ను డ్రమ్ములో వేసి.. కాంక్రీట్‌తో పూడ్చేసింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి సిమ్లా చెక్కేసి జల్సాలు చేసింది. ఇలాంటి ఘటనలు చూసే ఆ కొత్త పెళ్లికొడుకు షంషేర్ బెదిరిపోయాడు. తన భార్య తనకు వద్దు మొర్రో అని పోలీసులకు చెప్పేశాడు. తాను వస్తానన్నా.. తను తిరిగి అంగీకరించనని స్పష్టం చేశాడు. చేసేది లేక పోలీసులు కొత్త పెళ్లికూతురు ఖుషీని.. ఆమె ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించారు. పట్టుమని 10 రోజులకే.. అలా ముగిసింది ఆ వివాహ బంధం.
Chandauli News: शादी के बाद भागी पत्नी प्रेमी के साथ मिली तो पति ने लिया ऐसे बदला कि सब देखते रह गए!#chandaulinews #viralnews pic.twitter.com/e1o3YFkuND
— UP Tak (@UPTakOfficial) June 19, 2025