BigTV English

Weather Update: రాష్ట్రంలో భారీ వర్షం.. బలమైన ఈదురుగాలులతో వానలు, ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్

Weather Update: రాష్ట్రంలో భారీ వర్షం.. బలమైన ఈదురుగాలులతో వానలు, ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్

Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు అంతగా కొట్టడం లేదు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత రెండు వారాల నుంచి వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వరుణ దేవుడి వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.


ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

ఆదివారం రోజులన ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.


ALSO READ: Indigo Flight: భయపెట్టిన మరో విమానం.. ఇంధనం లేకుండా గాల్లో చక్కర్లు, చివరికి..

ఇక ఏపీలో రాబోయే 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం,పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ALSO READ: Indian Railways: రైల్వే ట్రాక్‌పై పడ్డ భారీ బండరాళ్లు.. ఆ మార్గంలో ఆగిన రైళ్లు

అయితే.. ఉరుములు, పిడుగుల వర్షం ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

Related News

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Jadcherla bakery: కర్రీ పఫ్ తింటుంటే నోటికి మెత్తగా తగిలింది.. ఏంటా అని చూస్తే పాము!

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Big Stories

×