2025 vs 1941: ఇప్పుడు నెట్టింట్లో ఓ ఆలోచన తెగ వైరల్ అవుతోంది. 2025 అంటే అసలు 1941 తిరిగి వచ్చినట్టే అంటున్నారు నెటిజన్లు. మీలో చాలామందికి 1941 అంటే గుర్తుండకపోవచ్చు. కానీ చరిత్రలో అది మానవాళికి తలదించుకునేలా చేసిన సంవత్సరం. అదే ఏడాది రెండో ప్రపంచ యుద్ధం వేగం పుంజుకుంది. దేశాలు ఒక్కొక్కటిగా తలకిందులయ్యాయి. ప్రజలెందరో జీవితాల్ని కోల్పోయారు. ప్రపంచం మొత్తం కలవరపడ్డ ఏడాది అది.
ఇప్పుడే 2025కి అడుగు పెడుతున్నప్పుడు.. అదే వాతావరణం మళ్లీ కనిపిస్తోంది అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఇదంతా ఊహలు కాదు. కొన్ని గమనించదగ్గ విషయాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
1941లో ఏం జరిగిందంటే…
రెండో ప్రపంచ యుద్ధం మాంద్యంలో ఉంది. కానీ 1941లో అది రక్తపాతంగా మారింది. అదే ఏడాది జపాన్ అమెరికా మీద పర్ల్‌హార్బర్ దాడి చేసింది. అమెరికా అగ్రరాజ్యంగా యుద్ధంలోకి దిగింది. ఆ తర్వాత ప్రపంచ రాజకీయం పూర్తిగా మారిపోయింది. జర్మనీ అతి తీవ్రమైన విధ్వంసానికి తెరలేపింది. లక్షల మంది అమాయకులపై బాంబుల వర్షం కురిపించబడింది. నాజీ నాయకుడు హిట్లర్ ఆ ఏడాది తన భయానకమైన ఎజెండాను వేగంగా అమలు చేశాడు. 1941లో ప్రపంచం గజగజలాడింది. ఇక మానవ హక్కులు, శరణార్థుల సమస్యలు మొదలైనవి అంతకుముందెన్నడూ లేనివిధంగా ప్రపంచాన్ని బలంగా తాకాయి.
అంటే ఇప్పుడు కూడా అంతేనా..?
అది కచ్చితంగా కాదనడానికి ఎవ్వరూ ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి పరిణామాలు కూడా అలానే భయపెడుతున్నాయి. యుద్ధ గాలులు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పుట్టే పరిస్థితి కనిపిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్నాయి. చైనా తైవాన్ వైపు కన్నేసి ఉంది. అమెరికాలో విద్యార్థులు, యూనివర్సిటీలు ప్రభుత్వ నిర్ణయాలపై తెగ ఎదురు తిరుగుతున్నాయి.
ఇక ఆర్థికంగా చూస్తే పరిస్థితి అంత శుభంగా లేదు. చమురు ధరలు ఊగిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు తడబడుతున్నాయి. బిట్‌కాయిన్, డాలర్ వంటి గ్లోబల్ కరెన్సీ వ్యవస్థలు అనిశ్చితిలో పడుతున్నాయి. ఇవన్నీ చూస్తే 1941లో ఉన్న గందరగోళానికి అచ్చుగా తలపోతున్నాయన్న ఫీల్ వస్తోంది.
అవే పొలికలు.. అదే భయం..
1941లో ప్రజల్లో భయం ఎలా ఆవరించిందో, ఇప్పుడు కూడా అదే జరుగుతోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా లో మీమ్స్, గణాంకాలు, పోలికలు తెగ షేర్ అవుతున్నాయి. 2025 అంటే Year of Doom కాదు కదా? అని చెబుతున్నారు. కొన్ని పోస్టుల్లో ఇలా కూడా కనిపిస్తోంది అప్పుడు జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుందని.
ఇది కేవలం గేమ్ ఆఫ్ థ్రోన్స్ డైలాగ్‌లా అనిపించినా, పక్కన ఉన్న ప్రపంచ వాస్తవాలు చూసిన తర్వాత మాత్రం అర్థమవుతోంది.. ఇది గట్టి హెచ్చరిక.
Also Read: Warangal Station New Look: వావ్.. వరంగల్ రైల్వే స్టేషన్.. ఎయిర్ పోర్టును మించిపోయిందిగా!
మరి ప్రజలు ఏమంటున్నారు..?
ఇటీవల ప్రజల్లో నిజంగా ఈ భయం ఉంది. ఈ సంవత్సరానికి ఏమో.. ఓ నమ్మశక్యం కాని నేపథ్యం ఉంది అంటున్నారు కొందరు. 1941లో ప్రపంచం ఎలా నాశనమైనదో మనం చదివాం. ఇప్పుడు 2025లో అదే మూడ్ తిరిగి వస్తోందంటే భయపడక తప్పదు అంటున్నారు ఇంకొందరు. కొందరైతే ఈ సంవత్సరాన్ని జాగ్రత్తగా చూడాలి అంటున్నారు. పాలకులు హిట్లర్‌లా నిర్ణయాలు తీసుకోకూడదంటున్నారు. పౌరులు నిశ్శబ్దంగా చూసి ఉండకూడదంటున్నారు. చరిత్ర మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే, ఇప్పుడే స్పందించాలి అంటున్నారు.
ఇది అపోహా..? లేక సంకేతమా..?
ఇది పక్కా సంకేతమనే చెప్పలేము. కానీ ఇది అపోహే అని కొట్టిపారేయడం కూడా తగదు. మనం చరిత్రను పట్టించుకోకపోతే, అది మళ్లీ మన మీద తిరగబడుతుంది. ఒకసారి ప్రపంచం పాఠం నేర్చుకోవాల్సింది ఇప్పుడు నేర్చుకుంటే మంచిదన్నదే నెటిజన్స్ అభిప్రాయం. ప్రపంచం ఇప్పుడు మళ్లీ ఒక సున్నితమైన దశలో ఉంది. ప్రతి చిన్న నిర్ణయం, ప్రతి చిన్న యుద్ధం, ప్రతి దేశ నాయకుడి మాట.. ప్రపంచ భద్రతపై ప్రభావం చూపేలా మారిపోయింది. 1941లో జరిగినది మనం ఆపలేకపోయాం. కానీ 2025లోనైనా మనం నిరీక్షిస్తూ ఉండకూడదని పలువురి అభిప్రాయం.
2025 సంవత్సరం చరిత్ర తిరిగిరాస్తుందా అనే కోణంలో చూస్తున్నారు కొంతమంది. అది నిజమే అయితే.. ఇప్పుడు జరిగే ఘటనలు, మన భవిష్యత్‌ను నిర్ణయించేదిగా ఉంటుంది. ఓ హెచ్చరిక వలె వచ్చిన ఈ పోలికలు ఉన్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది.