BigTV English
Advertisement

Dr Bhawana Dies: డాక్టర్ భావనది ముమ్మాటికీ హత్య? ఒళ్లంతా చెప్పలేని గాయాలు

Dr Bhawana Dies: డాక్టర్ భావనది ముమ్మాటికీ హత్య? ఒళ్లంతా చెప్పలేని గాయాలు

Dr Bhawana Dies: పీజీ మెడికల్ స్టూడెంట్ భావన యాదవ్ హత్య కేసులో ఏం జరుగుతోంది? ఆమె శరీరంపై కత్తిపోట్లు, కాలిన గాయాలు ఎందుకున్నాయి? ఆమెని టార్చర్ చేసి చంపిందెవరు? అయిన వాళ్లా? ఎవరైనా ప్రత్యర్థులా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాదాపు నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి సోమవారం మృతి చెందింది. ఇది ముమ్మాటికీ హత్యేనని ఆమె కుటుంబసభ్యుల మాట.


అసలేం జరిగింది?

రాజస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల గ్రాడ్యుయేట్ డాక్టర్ భావన యాదవ్ హర్యానాలోని హిసార్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె శరీరంపై దాడి చేసిన గాయాలు ఉన్నాయి. ఆ తర్వాత శరీరం పలు చోట్లు కూలిపోయినట్టు ఉన్నాయి. కొన ఊపిరితో దాదాపు నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాటం చేసింది. చివరకు సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టింది. కూతురిపై దాడి చేసి హత్య చేశారన్నది ఆమె కుటుంబసభ్యుల ప్రధాన ఆరోపణ. భావన శరీరంపై ఎందుకు గాయాలు ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు.


రాజస్థాన్‌‌కి చెందిన 25 ఏళ్ల భావన యాదవ్‌ వైద్య విద్యార్థిని. రెండేళ్ల కిందట పిలిప్పిన్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. అయితే విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ మెడికల్‌ కోర్సుల కోసం ఢిల్లీలో కోచింగ్‌ తీసుకుంటోంది. మాస్టర్‌ ఆఫ్‌ సర్జరీ చదివేందుకు కావాల్సిన మెడికల్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పరీక్షలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతీవారం కోచింగ్ నిమిత్తం రాజస్థాన్‌ నుంచి ఢిల్లీకి వచ్చేది. అక్కడి నుంచి తన స్వగ్రామానికి వెళ్లేది.

యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న తన అక్క రూమ్‌కి ఏప్రిల్ 21న  ఢిల్లీకి భావన వచ్చింది. అక్కడి నుంచి ఏప్రిల్‌ 23న తన తల్లితో ఫోన్‌లో మాట్లాడింది. ఇంటికి వెళ్తానని తోబుట్టువుకు చెప్పి బయలు దేరింది. ఏప్రిల్‌ 24న ఆమె ఇంటికి వెళ్లలేదు కానీ చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. ఏప్రిల్ 24న ఉదేష్ యాదవ్ అనే వ్యక్తి భావన తల్లి గాయత్రికి ఫోన్‌ అసలు విషయం చెప్పాడు.

ALSO READ: ఒక్కో కత్తి పోటుకు రెండు లక్షలు, వీరయ్య హత్య కేసులో కీలక విషయాలు

భావనకు తీవ్రంగా గాయపడిందని, ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ నిమిత్తం హిసార్‌లో సోని హాస్పిటల్‌లో చేరినట్లు తెలిపాడు. ఈ విషయం తెలియగానే రాజస్థాన్ నుంచి తల్లి గాయత్రి.. సోని ఆస్పత్రికి చేరుకుంది. ఘటన ఎలా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. తీవ్రంగా కాలిపోవడంతో ఆమెను అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జైపూర్‌ తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.

కూతుర్ని గమనించిన కన్న తల్లి శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఆమెను తగలబెట్టిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురిది సహజ మరణం కాదని, కావాలనే ఎవరో హత్య చేసేందుకు కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేసింది. భావన ల్యాప్‌ టాప్, మొబైల్ ఫోన్ ఇతర డాక్యుమెంట్లు లేవు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు.

ఫోన్ చేసిన వ్యక్తి పేరు ఉమేష్ యాదవ్‌గా గుర్తించారు.  భావన గాయాలకు చికిత్స చేస్తున్నప్పుడు ముఖం, కడుపు, కాళ్ళు కాలిపోయినట్లు గుర్తించారు. ఆమె జుట్టు, వీపు పెద్దగా కాలిపోలేదు.పదునైన ఆయుధాలతో గాయాల గుర్తులు ఆమె కడుపుపై ​​కనిపించాయి. తన కుమార్తెను మొదట పదునైన ఆయుధంతో దాడి చేసి, ఆపై నిప్పంటించారని తల్లి గాయత్రి ప్రధానంగా ఆరోపిస్తోంది. భావనను ఆసుపత్రికి తీసుకొచ్చిన ఉమేష్‌ను విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు.

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×